- Telugu News Photo Gallery Spiritual photos Weekly Horoscope 07 December 2025 to 13 December 2025 check your astrological predictions in telugu
Weekly Horoscope: వారికి ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వార ఫలాలు (డిసెంబర్ 07-13, 2025): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం అన్ని విధాలు గానూ అనుకూలంగా ఉంది. అనేక అవకాశాలు కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి వారం రోజులు జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Updated on: Dec 06, 2025 | 3:42 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి సమయం అన్ని విధాలు గానూ అనుకూలంగా ఉంది. అనేక అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత పురోభివృద్ధికి సంబంధించి మీ ఆలోచనలను, ప్రయత్నాలను కార్య రూపంలో పెడితే సత్ఫలితాలనిస్తాయి. ఇతరులకు ఆర్థికంగా వీలైనంతగా సహాయపడతారు. బంధువుల నుంచి పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా సహోద్యోగులకు సహకారం అందించడం జరుగుతుంది. వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తరచూ గణపతి స్తోత్రం పఠించడం చాలా మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వారం రోజుల జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతి ఫలం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొద్దిగా శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల బాగా లబ్ధి పొందు తారు. సహోద్యోగులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదిత్య హృదయం పఠించడం వల్ల విజయాలు సిద్ధిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. సోదరులతో అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులనుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పెద్దల సహాయంతో కుటుంబ వ్యవహారాలు చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. తరచూ స్కంద స్తోత్రం పఠించడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. స్వగృహ ప్రయత్నాల మీద శ్రద్ద పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో అదృష్టం బాగానే కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ ఆదిత్య హృదయం పఠించడం చాలా అవసరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వారమంతా చాలావరకు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పెండింగ్ పనులు తేలికగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారం రోజుల పాటు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు బిజీగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. సుఖ సంతోషాలు పెరగడానికి చేసే ఎలాంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్నిస్తుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి. తరచూ దుర్గాదేవిని ప్రార్థించడం ఉత్తమం.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వారం రోజుల జీవితం మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది. బయటి జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది కానీ, కుటుంబ జీవితం నిరుత్సాహం కలిగిస్తుంది. పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్ది పాటి అసంతృప్తికి అవకాశం ఉంది. తరచూ శివార్చన చేయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిళ్ల నుంచి కొంత వరకు బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో సొంత బాధ్యతల్ని పూర్తి చేయడంతో పాటు, తోటి ఉద్యోగులకు సహాయపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. తరచూ లలితా సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల కోరికలు నెరవేరుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2): ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల ప్రయోజనం పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయానికి తగ్గ ట్టుగా కుటుంబ ఖర్చులుంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాల్ని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నా కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. బంధు వుల రాకపోకలుంటాయి. వ్యాపార భాగస్వాములతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల లాభం ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇంటా బయటా పని భారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. తోబుట్టువులతో గానీ, దగ్గర బంధువులతో గానీ చాలా కాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగుతాయి. తరచూ శనికి ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ది చెంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు పెరుగుతుంది. గణపతి స్తోత్ర పఠనం వల్ల బాగా కలిసి వస్తుంది.



