- Telugu News Photo Gallery Cinema photos Alia Bhatt Shares Her Husband Ranbir Kapoor Dream Home Photos With Her Daughter
Tollywood: రూ.350 కోట్ల విలువైన ఇంట్లోకి స్టార్ హీరోయిన్.. భర్తతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ ఇదిగో..
సాధారణంగా సినీరంగంలోని స్టార్స్ ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారో చెప్పక్కర్లేదు. సినిమాలతోపాటు నిర్మాణం, వ్యాపార రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ రాణిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తన భర్త, కూతురితో కలిసి నూతన గృహ ప్రవేశం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.
Updated on: Dec 06, 2025 | 1:46 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సెలబ్రెటీ కుటుంబాల్లో కపూర్ ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది తారలు ఇప్పుడు సినీరంగంలో చక్రం తిప్పుతున్నారు. అందులో రణబీర్ కపూర్ ఒకరు. ఇటీవలే యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్నారు.

ఇప్పుడు తన భార్య ఆలియా భట్, కూతురు రాహాతో కలిసి ముంబైలో నూతనంగా నిర్మించుకున్న కొత్త బంగ్లాలోకి అడుగుపెట్టారు. ఆలియ, రణబీర్ దంపతులు కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అలియా.

ఆలియా, రణబీర్ కొత్తగా నిర్మించుకున్న ఆ ఇంటి విలువ రూ.350 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆలియా షేర్ చేసిన ఫోటోలు ఆధునిక డిజైన్ అంశాలతో సాంప్రదాయ భారతీయ వాతావరణాన్ని చూపించే అద్భుతమైన ఇంటీరియర్‌లను వెల్లడించాయి.

ఆలియా లేత గులాబీ రంగు చీరలో, రణబీర్ తెల్లటి ఎంబ్రాయిడరీ కుర్తా-పైజామాలో పూజ చేస్తున్నట్లు కనిపించారు. అలాగే వీరితోపాటు రాహ సైతం అందమైన ట్రెడిషనల్ లుక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తమ కూతురు ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆలియా

ర్మాణం దివంగత నటుడు రిషి కపూర్ పర్యవేక్షణలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ ఇల్లు బాంద్రాలోని ఉన్నత స్థాయి పాలి హిల్‌లోని పూర్వపు 'కృష్ణ రాజ్' బంగ్లా ప్లాట్‌పై నిర్మించారు. ఇది కపూర్ కుటుంబ చరిత్రలో లోతుగా పాతుకుపోయిన ఆస్తి, మొదట రణ్‌బీర్ తాతామామలు, రాజ్ కపూర్, కృష్ణ రాజ్ కపూర్‌లకు చెందినది.




