PAN Card: బిగ్ అలర్ట్.. జనవరి నుంచి ఈ పాన్ కార్డులు చెల్లవు.. అప్పుడేం చేయాలి?
PAN Card Rules: మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ లేకపోతే పాన్ కార్డు నిష్క్రియం అవుతుంది. దీనివల్ల ఆదాయపు పన్నులు దాఖలు చేయడం, పన్ను వాపసులు, బ్యాంకింగ్ లావాదేవీలు లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంలో సమస్యలు తలెత్తవచ్చు..

PAN Card Rules: ఆధార్ కార్డు, పాన్ కార్డు నేటి కాలంలో అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం చాలా అవసరం. మీరు ఇంకా లింక్ చేయకపోతే వెంటనే చేయండి. డిసెంబర్ 31 లోపు మీరు మీ ఆధార్-పాన్ కార్డును లింక్ చేయకపోతే జనవరి 1 నుండి పాన్ కార్డు నిష్క్రియంగా మారుతుందని ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA(2A) ప్రకారం.. ఆధార్-పాన్ కార్డు లింక్ అందరికీ తప్పనిసరి.
సమస్య ఏమిటి?
మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ లేకపోతే పాన్ కార్డు నిష్క్రియం అవుతుంది. దీనివల్ల ఆదాయపు పన్నులు దాఖలు చేయడం, పన్ను వాపసులు, బ్యాంకింగ్ లావాదేవీలు లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంలో సమస్యలు తలెత్తవచ్చు. పాన్ కార్డు నిష్క్రియం చేయబడితే TDS/TCS మరింత తగ్గించబడుతుంది. అదనంగా సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న వివిధ రాయితీలు. పొదుపు ఖాతాలు అందుబాటులో ఉండవు. బ్యాంకుల్లో కేవైసీ కారణంగా అకౌంట్ నిలిపివేయవచ్చు.
ఈ ఏడాది ఏప్రిల్ 3న CBDT మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డులను పొందిన వారు డిసెంబర్ నాటికి ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయడం తప్పనిసరి.
Flipkart Sale: రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌లో బై బై 2025 సేల్.. ఎన్నడు లేని ఆఫర్లు!
ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా?
- మీరు ఇంటి నుండే మీ ఆధార్-పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు.
- దీని కోసం మీరు ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లాలి.
- తరువాత లింక్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు పాన్, ఆధార్ నంబర్, పేరును నమోదు చేయండి.
- తర్వాత OTPని నమోదు చేయండి
- మీరు సకాలంలో లింక్ చేయకపోతే మీకు రూ.1000 జరిమానా విధించబడుతుంది.
- ఇప్పుడు లింక్ అభ్యర్థనను సమర్పించండి.
- మూడు నుంచి ఐదు రోజుల్లో ఆధార్-పాన్ లింక్ అవుతుంది.
పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే ఏమి చేయాలి?
- మీ పాన్ కార్డ్ ఇప్పటికే డీయాక్టివేట్ అయి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- ముందుగా ఆదాయపు పన్ను పోర్టల్‌కి వెళ్లండి.
- ఇప్పుడు మీరు ఇ-పే టాక్స్ ద్వారా రూ. 1,000 జరిమానా చెల్లించాలి.
- తర్వాత పాన్-ఆధార్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.
- మీ పాన్ కార్డ్ ఇప్పుడు 30 రోజుల్లో యాక్టివేట్ అవుతుంది.
- ఈ కాలంలో ఎటువంటి పెద్ద లావాదేవీలు చేయకపోవడమే మంచిది.
Alcohol: ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్ 1.. తెలంగాణ ఏ స్థానంలో ఉందో తెలిస్తే షాకవుతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








