SIPలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఇదో పాఠం! కచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన విషయం
చాలా మంది కొత్త పెట్టుబడిదారులు SIP రాబడిని సరిగ్గా అర్థం చేసుకోరు, FDలతో తప్పుగా పోలుస్తారు. పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు గౌరవ్ ముంద్రా వివరించినట్లు, SIP పెట్టుబడులు ఒకేసారి కావు. సగటు పెట్టుబడి కాలం తక్కువగా ఉంటుంది. అధిక లాభాల కోసం SIPలో దీర్ఘకాలిక ఓపిక, క్రమశిక్షణ అవసరం.

చాలా మంది కొత్త పెట్టుబడిదారులు SIP(సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)ని సరిగ్గా అర్థం చేసుకోరు. ఈ విషయం గురించి పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు, S అండ్ P ఫైనాన్షియల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంద్రా మాట్లాడుతూ.. చాలా మంది SIP పనితీరును తప్పుగా ఎందుకు లెక్కిస్తారో, తరచుగా దానిని ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఎందుకు పోలుస్తారని అంశాలను వివరించారు.
తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో ముంద్రా తన SIP ని ఆపాలనుకున్న క్లయింట్‌తో జరిగిన సంభాషణను పంచుకున్నారు. ఆ క్లయింట్.. ‘నేను నా SIPని ఆపాలని ఆలోచిస్తున్నాను. నేను రూ.1,20,000 పెట్టుబడి పెట్టాను, రూ.10,000 మాత్రమే సంపాదించాను. FDపై ఇంతకంటే ఎక్కువ ఇస్తుంది’ అని చెప్పినట్లు ముంద్రా తెలిపారు. చూడగానే కరెక్టే కదా.. రూ.1.20 లక్షల పెట్టుబడిపై కేవలం రూ.10 వేల రిటర్న్స్ అంటే వేస్తే కదా అని అనిపించవచ్చు.
కానీ ముంద్రా ఇలా రాశారు.. “మీరు ఒకే షాట్‌లో రూ.1,20,000 పెట్టుబడి పెట్టారా?” అని అడిగాడు. “కాదు, ఇది ప్రతి నెలా రూ.10,000 SIP” అని క్లయింట్ బదులిచ్చాడు. ముంద్రా తన పోస్ట్‌లో వివరించినట్లుగా, “మీ మొదటి రూ.10,000 12 నెలలు పెట్టుబడిగా ఉంటుంది. మీ రెండవ రూ.11 నెలలు ఉంటుంది. మీ మూడవ రూ.10, మీ చివరి రూ.10,000 కేవలం 10 రోజుల క్రితం పెట్టుబడి పెట్టారు.” కాబట్టి పెట్టుబడిదారుడు తాను “ఒక సంవత్సరం పాటు” పెట్టుబడి పెట్టానని భావించినప్పటికీ, పూర్తి మొత్తం 12 నెలలు మార్కెట్లో లేదు. సగటున డబ్బు కేవలం ఆరు నెలలు మాత్రమే పెట్టుబడిగా ఉంది. అయితే ఎక్కువ కాలం ఓపికగా, క్రమ శిక్షణగా SIPలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి అధికంగా ఉంటుంది. ఇలా ఆయన తన క్లయింట్ ఆలోచన విధానాన్ని మార్చేశారు. మీరు కూడా SIP విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకొని పెట్టుబడిని మధ్యలోనే ఆపేయకండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




