AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘పుష్ప 2’ ప్రభంజనానికి ఏడాది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' ఫ్రాంచైజీ, భారతీయ సినీ పరిశ్రమలో ఒక సరికొత్త చరిత్రను లిఖించింది. ముఖ్యంగా, 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2' సినిమా రికార్డుల స్థాయిలో వసూళ్లు సాధించి, ట్రేడ్‌ వర్గాలను ..

Pushpa 2: 'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్!
Allu Arjun And Sukumar
Nikhil
|

Updated on: Dec 06, 2025 | 10:23 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ, భారతీయ సినీ పరిశ్రమలో ఒక సరికొత్త చరిత్రను లిఖించింది. ముఖ్యంగా, ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప 2’ సినిమా రికార్డుల స్థాయిలో వసూళ్లు సాధించి, ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్, కథ, ఎమోషన్, సాంగ్స్, యాక్షన్.. ఇలా ప్రతీ విభాగంలో నెంబర్ వన్‌గా నిలిచి, అల్లు అర్జున్ నటనకు మరో మైలురాయిగా నిలిచింది.

బాక్సాఫీస్‌ వద్ద రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే భారీ హిట్‌గా నిలిచింది. సరిగ్గా ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తున్న వేళ, ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకొని, హీరో అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్‌తో తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు.

ఐదేళ్ల ప్రయాణానికి కృతజ్ఞతలు..

‘పుష్ప 2’ సాధించిన భారీ విజయాన్ని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఈ ప్రయాణం కేవలం ఒక సినిమాకు సంబంధించినది కాదని, ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణం అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశిస్తూ… “ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాకు సరికొత్త ధైర్యాన్ని ఇచ్చింది.

పుష్పరాజ్ పాత్రకు మీరు అందించిన అద్భుతమైన ఆదరణ మమ్మల్ని ముందుకు నడిపింది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా, ప్రత్యేకంగా మార్చిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి గొప్ప టీమ్‌తో పనిచేయడం ఎప్పుడూ ఒక గౌరవంగానే భావిస్తాను” అంటూ రాసుకొచ్చారు. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘పుష్ప 2’తో కనీవినీ ఎరుగని రికార్డులను సృష్టించిన అల్లు అర్జున్, తన తదుపరి ప్రాజెక్టులతో ప్రేక్షకులను మరింతగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో, ఒక సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.