Cinema : న్యూస్ చదివే అమ్మాయిలే అతడి టార్గెట్.. వరుస హత్యలు.. ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి నిత్యం కొత్త కంటెంట్ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ తమిళ సైకలాజికల్ క్రైమ్ త్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇవాళ స్ట్రీమింగ్ కు రానుంది. 9 మంది యువతులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ కథతో తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ సినీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

ఓటీటీలోకి సరికొత్త త్రిల్లర్ చిత్రాలు తీసుకువస్తున్నారు మేకర్స్. అడియన్స్ ఆసక్తికి అనుగుణంగా హారర్, సస్పెన్స్ మిస్టరీ చిత్రాలు, వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘స్టీఫెన్’. శుక్రవారం ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో వైరలవుతుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
న్యూస్ చదువుతున్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కథ ఇది. ఈ హత్యలకు తానే కారణమని అంగీకరించిన ముద్దాయి స్టీఫెన్ జెభరాజ్.. తనకు లాయర్ అవసరం లేదని తన కేసును తానే వాదించుకుంటానని అంటాడు. మొత్తం తొమ్మిది మంది అమ్మాయిలను హత్య చేసినట్లు స్టీఫెన్ చెప్పడంతో అంతా షాకవుతారు.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
అసలు స్టీఫెన్ ఈ హత్యలు ఎందుకు చేశాడు.. ? ఎవరితో కలిసి చేశాడు ?అనేది సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, వడివేల్, విజయశ్రీ, శ్రీష కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ రాయన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వెంకట్ పాండియన్ నిర్మించారు. గోకుల్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు.
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..




