Aha OTT: ఊహించని ట్విస్టులు.. మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న ధూల్ పేట్ పోలీస్ స్టేషన్..
ప్రస్తుతం మూవీ లవర్స్ విభిన్న కంటెంట్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. అటు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలతోపాటు.. జనాల ఆసక్తికి తగ్గట్టుగా సరికొత్త జానర్ సినిమాలను, వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది.

సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీసుకువచ్చింది. ఆ సిరీస్ పేరు ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘. ప్రస్తుతం ఈ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇందులో అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, ప్రీతి శర్మ, గురు కీలకపాత్రలు పోషించారు. అలాగే జెస్విని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇప్పుడు డిసెంబర్ 5 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘ సిరీస్ అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
ఈ సిరీస్ కు అశ్వతన్ మ్యూజిక్ అందించారు. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరిగితే ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్ లో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీపీ అశ్విన్ నేరస్తులను పట్టుకున్నాడా లేదా ఈ కేసుల విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్‘ సిరీస్ లో చూడాలి.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఆద్యంతం ఉత్కంఠగా సాగే ట్వి్స్టులు.. ఊహించని మలుపులు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈసిరీస్ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తుంది. కేసుల చుట్టూ సాగే ఈ ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఇప్పుడు ఆహా ఓటీటీలో చూడొచ్చు.
The investigation begins this December 🚨🚔#DhoolpetPoliceStation Premieres 5th Dec only on #ahaEvery Friday – New Episodes#DhoolpetOnaha pic.twitter.com/EUadfirmZm
— ahavideoin (@ahavideoIN) November 20, 2025
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..
