ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్‌లు ట్రై చేసి చూడండి! గుడ్ హెల్త్ గ్యారెంటీ
ఉదయం తీసుకునే అల్పాహారం మన రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే అల్పాహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటే, అది రోజంతా నిరంతర శక్తిని అందిస్తుంది. ప్రోటీన్ జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఇది త్వరగా ఆకలి వేయకుండా ..

ఉదయం తీసుకునే అల్పాహారం మన రోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే అల్పాహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటే, అది రోజంతా నిరంతర శక్తిని అందిస్తుంది. ప్రోటీన్ జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఇది త్వరగా ఆకలి వేయకుండా, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.
తద్వారా అనవసరమైన చిరుతిళ్లను తినకుండా బరువు నియంత్రణలోనూ సహాయపడుతుంది. మన శరీరానికి అవసరమయ్యే రోజూవారి ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి, పనీర్ ఒక అద్భుతమైన ఆహారం. రుచి విషయంలో రాజీ పడకుండా, పోషకాలను అందించే 5 పనీర్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఎంటో తెలుసుకుందాం..
పనీర్ భుర్జీ టోస్ట్
గుడ్డు భుర్జీ మాదిరిగానే, తురిమిన పనీర్‌ను టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ మరియు తక్కువ మసాలాలతో కలిపి వండటం. ఇది త్వరగా తయారయ్యే రుచికరమైన ప్రోటీన్ వంటకం. క్రిస్పీగా ఉండే టోస్ట్‌తో కలిపి తీసుకుంటే, బిజీగా ఉండే ఉదయం వేళల్లో తక్షణ శక్తిని ఇస్తుంది.
పనీర్ స్టఫ్డ్ పరాఠా
తురిమిన పనీర్‌ను వాము, కొత్తిమీర, పచ్చిమిర్చి వంటి వాటితో కలిపి పిండిలో నింపి చేసే సంప్రదాయ పరోటా ఇది. ఇది ఒక సంపూర్ణమైన క్లాసిక్ బ్రేక్‌ఫాస్ట్. అధిక శక్తిని ఇచ్చి, చాలా గంటల పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీన్ని పెరుగు లేదా పచ్చడితో కలిపి తీసుకోవచ్చు.
పనీర్ వెజిటబుల్ ఉప్మా
సాంప్రదాయ ఉప్మాకు ప్రోటీన్ జోడింపు. ఉప్మా రవ్వతో పాటు, ముక్కలు చేసిన పనీర్, క్యారెట్లు, బీన్స్, బఠానీలు వంటి కూరగాయలను కూడా వేసి తయారుచేయడం. ఇది తేలికగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఉదయం పూట ఉప్పు, కారం తక్కువగా ఉండే అల్పాహారాన్ని కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.
గ్రిల్డ్ పనీర్ శాండ్‌విచ్
మ్యారినేట్ చేసిన పనీర్ ముక్కలు, తాజా కూరగాయలు మరియు పుదీనా చట్నీతో నింపి గ్రిల్ చేస్తే సరిపోతుంది. ఇది సమతుల్యతతో కూడిన మరియు త్వరగా కడుపు నింపే ఆహారం. బయట క్రిస్పీగా, లోపల ప్రోటీన్-రిచ్ పనీర్ ఫిల్లింగ్‌తో రుచికరంగా ఉంటుంది.
పనీర్ ఆమ్లెట్
గుడ్డు ఆమ్లెట్, స్క్రాంబుల్‌లో చిన్న ముక్కలుగా కట్ చేసిన లేదా తురిమిన పనీర్‌ను, కొత్తిమీర, ఇతర కూరగాయలతో కలిపి తయారు చేసేదే పనీర్ ఆమ్లెట్. ఈ కాంబినేషన్ ద్వారా ఒకే భోజనంలో గుడ్డు, పనీర్ రూపంలో రెండు బలమైన ప్రోటీన్ మూలాలను పొందుతారు. ఇది చాలా సులభమైన, బలమైన అల్పాహారం. మీ రోజును ఆరోగ్యకరంగా, శక్తివంతంగా ప్రారంభించాలంటే, ఈ 5 పనీర్ వంటకాలను మీ బ్రేక్‌ఫాస్ట్ లో ట్రై చేసి చూడండి!




