AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

పుతిన్ వెంట ‘మలం’ సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

Phani CH
|

Updated on: Dec 06, 2025 | 9:33 AM

Share

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో కఠిన భద్రతా చర్యలతో పాటు ఆయన ఆరోగ్య రహస్యాలు చర్చనీయాంశమయ్యాయి. మలవిసర్జన వ్యర్థాలను బాడీగార్డులు ప్రత్యేకంగా సేకరించి తీసుకెళ్తున్నారట. ఇది పుతిన్ ఆరోగ్యంపై విదేశీయులకు సమాచారం అందకుండా నిరోధించడానికి. పార్కిన్సన్ వంటి వ్యాధి ఊహాగానాల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత్‌ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. పుతిన్‌కు స్వాగతం పలికేందుకు ప్రధాని మోదీ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టారు. స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఆయన గౌరవార్థం ఈ రాత్రి ఏర్పాటు చేసిన విందులో పుతిన్‌ పాల్గొంటారు. ఆయన పర్యటన సందర్భంగా పుతిన్‌కు ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పుతిన్‌ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన రక్షణ బాధ్యత ఫెడరల్‌ ప్రొటెక్షన్‌ సర్వీస్‌(ఎఫ్​పీఎస్) చూసుకుంటుంది. భారత పర్యటన సమయంలో కూడా కఠిన భద్రతా చర్యలను అమలు చేసారు. పుతిన్ చుట్టూ బాడీగార్డులు మెహరించారు. రష్యా గూఢచార సమాచారాన్ని కాపాడేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. పుతిన్ మలవిసర్జన వ్యర్థాలను తీసుకెళ్లడానికి ఆయన బాడీగార్డులు ప్రత్యేకంగా ఓ సూట్‌కేసును వెంటబెట్టుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పుతిన్ ఆరోగ్యం గురించి విదేశీయులు తెలుసుకోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకున్నట్లు సమాచారం. పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఆయన బాడీగార్డులు మలవిసర్జన వ్యర్థాలను సేకరించి రష్యాకు తిరిగి తీసుకెళ్తారు. మల పరీక్ష ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉండటం వల్లే ఈ జాగ్రత్తను పాటిస్తూ వస్తున్నారు. పుతిన్‌ మలమూత్రాలను సేకరించే పద్ధతి 1999లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కొనసాగుతోంది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటికే పలు ఊహాగానాలు వచ్చాయి. గత నవంబరులో కజకిస్థాన్​లో జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ కాళ్లు అనూహ్యంగా వణికినట్లు కనిపించిందని వార్తలు వచ్చాయి. అయితే అది పార్కిన్సన్ వ్యాధి వంటి నాడీకి సంబంధించిన సమస్య కావచ్చని పత్రికలు కథనాలు రాసాయి. 2023లో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశంలో ఆయన కుర్చీలో వణుకుతున్నట్లు కనిపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్