తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
దిత్వా తుపాను ప్రభావంతో బలహీనపడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉండగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని అంచనా.
దిత్వా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై .. శుక్రవారం వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడిందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం లో శుక్ర, శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడే అవకాశముంది. శనివారం ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమలో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని ప్రకటన విడుదల చేసింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే.. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
గంగిరెద్దుల కాలనీ చూసొద్దాం.. సంక్రాంతి సంబరాల్లో వీటి విన్యాసాలే
రంగుల మిరపకాయలు .. క్యాప్సికం మాత్రం కాదండోయ్

