AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్య అలెర్ట్.. వారంలోగా గ్రూప్ 1 నోటిఫికేషన్.?

తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్య అలెర్ట్. వారంలోగా గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్వీస్..

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్య అలెర్ట్.. వారంలోగా గ్రూప్ 1 నోటిఫికేషన్.?
Ts Govt Jobs 2022
Ravi Kiran
|

Updated on: Apr 19, 2022 | 7:44 PM

Share

తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్య అలెర్ట్. వారంలోగా గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఆర్ధిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్ 1 పోస్టులకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వ శాఖల వారీగా ప్రతిపాదనలు అందించాయి. అయితే ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో పలు సందేహాలు తలెత్తడంతో.. ఆయా శాఖలను సవరించిన ప్రతిపాదనలను పంపాలని కమిషన్ కోరినట్లు తెలుస్తోంది.

అవి రాగానే టీఎస్‌పీఎస్సీ సమావేశమై తుది నిర్ణయాన్ని తీసుకోనుంది. ఆ తర్వాత కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటనను జారీ చేయనుందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్ ప్రక్రియను త్వరతగిన పూర్తి చేసేందుకు టీఎస్‌పీఎస్సీ వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంతవరకు వెలువడకపోవడంతో.. ఇప్పుడొచ్చేది తొలి ప్రకటన కానుంది.

ఇవి కూడా చదవండి: