AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: 5వ సారి కొత్త సెక్రటేరియట్‌కి సీఎం కేసీఆర్.. 80 శాతం పనులు పూర్తి..

తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌ను పరిశీలించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. పనులు ఎంతవరకు వచ్చాయి.. అనుకున్నట్టే జరుగుతున్నాయా లేదా స్వయంగా తెలుసుకుంటున్నారు. 

CM KCR: 5వ సారి కొత్త సెక్రటేరియట్‌కి సీఎం కేసీఆర్.. 80 శాతం పనులు పూర్తి..
Cm Kcr
Sanjay Kasula
|

Updated on: Apr 19, 2022 | 7:49 PM

Share

తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌ను(Secretariat Construction) పరిశీలించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR). సచివాలయ భవనం లోపల కలియ తిరుగుతున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయి.. అనుకున్నట్టే జరుగుతున్నాయా లేదా స్వయంగా తెలుసుకున్నారు. పదికాలాల పాటు నిలవాలి. దేశానికి వన్నె తేవాలి. రాజీపడకుండా సచివాలయం నిర్మించండి. కొత్త సెక్రటేరియట్‌ పనుల పరిశీలన తర్వాత అధికారులకు సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌ చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. దసరా నాటికి పూర్తిచేయాలని టార్గెట్‌గా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకోవడంతో సచివాలయ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 నుంచి 70 శాతం వరకు పనులు పూర్తైనట్లు తెలుస్తున్నాయి. డోమ్​లు, ఫ్రంట్ ఎలివేషన్​కు సంబంధించిన పనులతో పాటు ఇతర పనులు సమాంతరంగా సాగుతున్నాయి. గతంలో సచివాలయ ప్రాంగణం మొత్తం 25 ఎకరాల్లో ఉండగా.. వాస్తు సహా అన్ని రకాలుగా 20 ఎకరాల మేర చతురస్రాకార స్థలాన్ని ఎంపిక చేసి అందులో నిర్మాణం చేపట్టారు.

మొత్తం తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం పూర్తి చేశారు. మొత్తం పనుల్లో 60 నుంచి 70 శాతం వరకు ముగించారు. కాంక్రీటు, స్లాబులకు సంబంధించిన పనులన్నింటినీ పూర్తి కాగా.. భవనం పైభాగాన శిఖరాలుగా వచ్చే డోంల నిర్మాణంతో పాటు ఫ్రంట్ ఎలివేషన్ పనులు కొనసాగుతున్నాయి.

ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశ మందిరం, పెద్ద సమావేశ మందిరం తదితరాలు ఉంటాయి. రెండో అంతస్తు నుంచి మంత్రుల కార్యాలాయాలు ఉంటాయి. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. సర్వర్లు, స్టోర్ రూంలు, తదితర అవసరాలన్నింటినీ కింది అంతస్తులోనే ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి.. నేను రబ్బర్‌ స్టాంప్‌ గవర్నర్‌ని కాదు..

Minister Harish Rao: రోగి సహాయకులకు రూ.5 భోజనం.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..