Governor Tamilisai: సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి.. నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ని కాదు..
సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి..తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ని కాదన్నారు గవర్నర్ తమిళిసై. రాజకీయంలో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు.. ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారని..
తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో(CM KCR) కలిసి పనిచేయడం నాకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి..తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ని కాదన్నారు గవర్నర్ తమిళిసై. రాజకీయంలో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు.. ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు. నన్ను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది వాస్తవం కాదన్నారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే నాపై అసత్య ప్రచారం మొదలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటదో.. తెలంగాణను చూస్తే తెలుస్తుందన్నారు గవర్నర్ తమిళిసై.
తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. మంత్రుల వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్.. సర్కార్‌పై తాను ఏనాడు ఎలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. అకస్మాత్తుగా ఢిల్లీకి పయణమైన గవర్నర్.. కేంద్రం పెద్దలతో వరుస భేటీలు అయిన సంగతి తెలిసిందే. మీడియాతో చిట్ చాట్ చేసిన గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజా సేవలో ఉంటాను తప్పితే.. ప్రొటోకాల్‌ను పట్టించుకోనని స్పష్టం చేశారు.
ప్రొటోకాల్ విషయాలు కేంద్రం చూసుకుంటుందన్న ఆమె.. అందుకే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఈ విషయంలో కేంద్రమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని కామెంట్ చేశారు గవర్నర్. రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నానని గుర్తుచేసిన ఆమె.. తన బాధ్యతలను తాను నిర్వహిస్తున్నానన్నారు. ఎవరు ఏమన్నా ఇందులోఎలాంటి రాజకీయ ఎజెండా లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థలను అందరు గౌరవించాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలన్న కాంగ్రెస్ ఫిర్యాదును సంబంధింత వర్గాలకు పంపానన్నారు తమిళిసై. ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని తాను ఏనాడూ అనలేదన్నారు. రాజకీయం చేస్తున్నానని తనను అనవసరంగా విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ టూర్‌లో ఉన్న తమిళిసై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవిలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు తమిళిసై.
ఇవి కూడా చదవండి: JC Prabhakar Reddy: చిన్నారి మృతితో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడిన జేసి
భారతసైన్యంలో ఇంటిదొంగలు.. వాట్సాప్ సందేశాలతో చైనా,పాక్‌కు సమాచారం చేరవేస్తునట్టు గుర్తింపు