JC Prabhakar Reddy: చిన్నారి మృతితో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడిన జేసి
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా (Ananatapuram) కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఓ ర్యాలీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి..
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా (Ananatapuram) కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఓ ర్యాలీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మృతిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు ప్రభాకర్ రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీటర్ కేసు నమోదు చేస్తే భయపడేది లేదని అన్నారు. అంతేకాదు తాడిపత్రిలో మంత్రి ఉష శ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలకు జేసీ కౌంటర్ ఇచ్చారు. కల్యాణదుర్గంలో పసిపాప మృతి విషయంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రకాశ్‌నాయుడు నిరసన తెలిపితే అతనిపై రౌడీషీట్ తెరుస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తల్లో ధైర్యం నింపేలా మరింత పనిచేస్తాననన్నారు జేసి.
అంతేకాదు మంత్రి ఉష శ్రీ గతంలో ఏ పార్టీలో ఉన్నారో.. ఒక్కసారి గుర్తు చేసుకో అన్నారు. మీ పై కర్ణాటక లోకయుక్తా , సుప్రీం కోర్టు కేసుల విషయం చెప్పమంటారా అని ప్రశ్నించారు. మీకంటే గట్టిగా నేను విమర్శలు చేయగలను.. మొత్తం చెప్పగలను అయితే మహిళ కనుక అన్ని విషయాలు చెప్పడం లేదని అన్నారు జేసీ. తండ్రి చనిపోతే మూడేళ్ల శవ రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మంత్రి ఉషా శ్రీ తాడిపత్రికి వచ్చి నా మీద విమర్శలు చేయడం సరికాదన్నారు. మంత్రి ఉషా శ్రీ విమర్శలు మానేసి.. చనిపోయిన పాప తండ్రి వికలాంగుడు.. కనుక మానవత్వంతో స్పందించి ఆ ఫ్యామిలీకి పెన్షన్ ఇప్పించాలని సూచించారు. అలా పింఛను ఇప్పిస్తే మీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.
Also Read:Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కన్నుమూత
‘Archery’: ఆర్చరీ షూటింగ్ ప్రారంభం.. ముగ్గురు బాలీవుడ్ నట వారసులు బీ టౌన్‌లో ఎంట్రీ