AP Inter online admissions 2022: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో! సీట్ల కేటాయింపు ఇలా..
వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యామండలి కసరత్తు (AP Higher Education Dept) చేస్తోంది..
AP Inter online admissions from next academic year 2022-23: వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యామండలి కసరత్తు (AP Higher Education Dept) చేస్తోంది. బీటెక్ తరహాలో స్టూడెంట్స్ ఆన్‌లైన్ ద్వారా నచ్చిన కాలేజిలో సీట్లను పొందే విధానం ఇంటర్ విద్యార్థులకు పెట్టాలనే డిమాండ్ నేపథ్యంలో 2020-21, 2021-22 ఆన్‌లైన్ ప్రవేశాల (inter admissions)నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ న్యాయస్థానం వాటిని కొట్టేసింది. దీంతో ఏ కళాశాలకు ఆ కళాశాల సీట్లను భర్తీ చేసుకున్నాయి.ఈ ఏడాది ఆన్‌లైన్ ప్రవేశాల విధానం తీసుకొచ్చేందుకు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యాశాఖ నియంత్రణలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా (ఎడ్సిల్) ప్రతినిధులు, ఇంటర్ విద్యామండలి సంయుక్త సంచాలకులతో కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, ఆన్‌లైన్ ప్రవేశాలపై అభిప్రాయాలు సేకరిస్తుంది. స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపులో ఉన్న ఇబ్బందులపైనా అధ్యయనం చేస్తుంది. రిజర్వేషన్లపై కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏపీ ఇంటర్ విద్యామండలి ప్రభుత్వానికి నివేదిక పంపనుంది.
ఆన్‌లైన్ ప్రవేశాలకు గతంలో ప్రకటించిన విధానం ప్రకారం విద్యార్థులు ఇంటర్ విద్యామండలి వెబ్‌సైట్ నుంచి కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్‌లో 88 సీట్లు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, అందుబాటులో ఉన్న సీట్లు, పదో తరగతి మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఇచ్చే ఐచ్ఛికాల్లో ఏదో ఒక కళాశాలలో సీటు కేటాయిస్తారు. మొదటి విడతలో సీటు రాకపోయినా, మొదటిసారి వచ్చిన సీటు నచ్చకపోయినా రెండో కౌన్సెలింగ్‌లో మార్చుకోవచ్చు.
Also Read: