Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కన్నుమూత

టాలీవుడ్‌‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ ... తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు.

Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కన్నుమూత
Narayan Das K Narang(File Photo)
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 19, 2022 | 10:46 AM

Noted exhibitor Narayan Das K Narang:  టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె నారంగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నారాయణ్ దాస్ కె నారంగ్ ఏషియన్ ఫిలిమ్స్ మరియు ఏషియన్ థియేటర్స్ గ్రూప్ అధినేతగా ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో లవ్ స్టోరీ(Love Story),లక్ష్య(Lakshya) సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఘోస్ట్, ధనుష్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నారు. ఫైనాన్సర్‌గా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా సిని పరిశ్రమకు సేవలందించారు నారాయణ దాస్ కె నారంగ్. ఆయన మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు.

Also Read: AP: లారీకి యాక్సిడెంట్.. గోనె సంచుల కట్టల మధ్యలో తెల్లటి సంచులు.. అనుమానంతో చెక్ చేయగా..