AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఆమె కళ్లలోనే ఏదో నిషా ఉంది.. ఈ అమ్మ కూచి ఎవరో గుర్తుపట్టారా..?

నేడు హీరోయిన్‌గా రాణిస్తున్న తెలుగు అమ్మాయి బర్త్ డే. ఆమె చిన్నప్పటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఎవరో గుర్తించారా..?

Viral Photo: ఆమె కళ్లలోనే ఏదో నిషా ఉంది.. ఈ అమ్మ కూచి ఎవరో గుర్తుపట్టారా..?
Heroine Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2022 | 10:54 AM

Share

Trending Photo: ప్రజంట్ తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావడమే అరుదు.. వచ్చి రాణించడం ఇంకా గొప్ప విషయం. తాజాగా సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా రాణిస్తున్న ఓ తెలుగు అమ్మాయి చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. అందుకు కారణం ఈ రోజు ఆమె బర్త్ డే. అమ్మ పక్కన కుందనపు బొమ్మలా ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తించలేకపోతున్నారా.. ?. ఇక మేమే చెప్పేస్తాం. ఆ చిత్రంలోని చిన్నారి నటి ఈషా రెబ్బా. ఈ నటి 1990 ఏప్రిల్ 19న వరంగల్(Warangal)​లో జన్మించింది. ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది. నటి కాకముందు మోడల్​గా పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. తొలుత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ‘అంతకముందు ఆ తర్వాత’, ‘అ!’, ‘అరవింద సమేత..’, ‘సుబ్రహ్మణ్యపురం’,  ‘బందిపోటు’, ‘ఓయ్​’, ‘అమి తుమీ’, ‘దర్శకుడు’ తదితర చిత్రాలతో మెప్పించింది. సినిమాల్లో మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి.. సూపర్ బ్రేక్ రాలేదు. ఓటీటీల్లోకి అడుగుపెట్టి ‘పిట్టకథలు’,’త్రీ రోజెస్‌’ లాంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ సందడి చేసింది. ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించింది ఈషా. అటు హీరోయిన్ గానే కాకుండా.. ఇటు బడా హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషిస్తుంది. ప్రస్తుతం మలయాళంలో ‘ఒట్టు’, తమిళంలో ‘అయిరామ్​ జెన్మంగల్​’ సినిమాలు చేస్తోంది.  కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన ఫోటోలను, మూవీ అప్‌డేట్స్‌ను నెటిజన్లతో పంచుకుటుంది. అందం, నటనతో సినీప్రియుల్ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే ఈషా.

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

Also Read: Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కన్నుమూత