UPI: డెబిట్ కార్డులపై RBI కీలక నిర్ణయం.. త్వరలో యూపీఐ ద్వారా ATMలలో డబ్బు ఉపసంహరణ..

UPI cash withdrawals: ఏటీఎం నుంచి యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ వెసులుబాటు కల్పించేందుకు ఆర్బీఐ(RBI) ముందుకు సాగుతోంది. రానున్న కాలంలో డెబిట్ కార్డులు కనుమరుగవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

UPI: డెబిట్ కార్డులపై RBI కీలక నిర్ణయం.. త్వరలో యూపీఐ ద్వారా ATMలలో డబ్బు ఉపసంహరణ..
Rbi
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 19, 2022 | 10:34 AM

UPI cash withdrawals: ఏటీఎం నుంచి యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ వెసులుబాటు కల్పించేందుకు ఆర్బీఐ(RBI) ముందుకు సాగుతోంది. ఇది డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ పైన తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల డెబిట్ కార్డు మనుగడకు ముప్పు తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం ద్వారా.. వినియోగదారులు ATM స్క్రీన్‌పై వచ్చే QR కోడ్‌ను స్కాన్ చేసి వారి UPI పిన్‌ని ఎంటర్ చేయటం ద్వారా లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. అటువంటి ఇటువంటి నగదు లావాదేవీలకు నగదు విత్ డ్రా లిమిట్ ఒక్కసారికి రూ. 5,000గా నిర్ణయించబడింది. ఒక్కో ఖాతాకు రోజుకు గరిష్ఠంగా రెండు లావాదేవీలు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. డెబిట్ కార్డ్‌లు ఎక్కువగా ATMలలో ఉపయోగించబడుతున్నందున.. UPI ద్వారా నగదు ఉపసంహరణ అందుబాటులోకి వస్తే కార్డుల వినియోగం తగ్గనుంది. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ATMలకు అవసరమైన టెక్నికల్ అప్‌గ్రేడ్‌ తక్కువ ఖర్చుతో కూడిన అంశం. దీనికి ఉన్న ప్రధాన అడ్డంకి ఏమిటంటే.. దేశంలో దాదాపు 400 మిలియన్ల భారతీయులకు ఇప్పటికీ QR కోడ్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌లు లేవు. కానీ.. దీనిని అందుబాటులోతి తీసుకురావటం వల్ల డిజిటల్ చెల్లింపుల్లో మరో పెను మార్పు వస్తుందని నినుణులు అంటున్నారు.

రిటైల్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ప్లాట్‌ఫామ్ UPI డిజిటల్ చెల్లింపుల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు పీడబ్ల్యుసీ ఇండియా నివేదిక తెలిపింది. బై నౌ పే లేటర్ (BNPL), సెంట్రల్ బ్యాంకు కరెన్సీ (CBDC) ట్రాన్సాక్షన్స్ కూడా వచ్చే అయిదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపుల్లో గణనీయ వృద్ధికి కీలకంగా మారనున్నాయని పేర్కొంది. భారత్ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ 23 శాతం స్థిర వార్షిక సంచిత వృద్ధి రేటును నమోదు చేస్తున్నట్లు తెలిపింది. 2025-26 నాటికి రూ.21,700 కోట్ల ట్రాన్సాక్షన్స్ డిజిటల్‌గా జరుగుతాయని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5900 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయి. ఈ మేరకు ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్ బుక్ 2021-26 పేరుతో పీడబ్ల్యుసీ ఇండియా నివేదిక రూపొందించింది. 2020-21లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ రూ.2200 కోట్లకు చేరాయి. 2025-26 నాటికి రూ.16500 కోట్లకు చేరే అవకాశముందని, అంటే 122 శాతం వృద్ధి రేటు అని పేర్కొంది.

ఇవీ చదవండి..

Stock Market: ఊగిసలాటలో కీలక సూచీలు.. లాభాల్లో ఆటో, మెటర్, గ్యాస్ షేర్లు..

Drugs: మహిళ ప్రైవెయిట్‌ పార్ట్‌లో ఆరు కోట్ల విలువైన డ్రగ్స్‌..! చుస్తే షాక్ అవ్వాల్సిందే..