AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infosys shares: రూ. 40వేల కోట్లు కోల్పోయిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు.. షేర్లను ఉంచుకోవచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..

Infosys shares: ఇన్ఫోసిస్​ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్​ సెషన్​లో 7 శాతం మేర పతనమైంది. ఉదయం మార్కెట్లు తెరుచుకున్న కొద్ది నిమిషాల్లోనే.. ఇన్వెస్టర్లు రూ. 40వేల కోట్ల సంపద ఆవిరైంది.

Infosys shares: రూ. 40వేల కోట్లు కోల్పోయిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు.. షేర్లను ఉంచుకోవచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Infosys
Ayyappa Mamidi
|

Updated on: Apr 19, 2022 | 11:09 AM

Share

Infosys shares: ఇన్ఫోసిస్​ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్​(Trading) సెషన్​లో 7 శాతం మేర పతనమైంది. ఉదయం మార్కెట్లు తెరుచుకున్న కొద్ది నిమిషాల్లోనే.. ఇన్వెస్టర్లు రూ. 40వేల కోట్ల సంపద ఆవిరైంది. మొత్తం ఐటీ సెక్టార్​(IT Sector) స్టాక్స్​పై ఈ ప్రభావం పడటంతో.. ఐటీ సూచీ ఏకంగా 4 శాతం మేర నష్టపోయింది. 2022 ఆర్థిక సంవత్సరం 4వ క్వార్టర్ లో ఇన్ఫోసిస్​ ఫలితాలు అంచనాలకు అందుకోకపోవటంతో షేర్ భారీ ప్రభావాన్ని చూసింది. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సర్వీసు సంస్థ అయిన ఇన్ఫోసిస్​ లాభం గత త్రైమాసికంతో పోల్చితే 12 శాతం పెరిగింది. రెవెన్యూ 23 శాతం పెరిగింది. కానీ.. ఇవి అంచనాల కంటే చాలా తక్కువగా ఉండటం, కంపెనీ మార్జిన్లపై ప్రభావం పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. థర్డ్​ పార్టీ వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడం మరో కారణంగా నిలుస్తోంది.

సోమవారం ఉదయం రూ. 1605 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన షేర్.. అంతకు ముందు క్లోజింగ్ అయిన రూ. 1749 కంటే సుమారు 150 రూపాయల తక్కువకు ట్రేడింగ్ ప్రారంభించింది. దీని వల్ల అనేక మంది ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. చివరిగా షేర్ 7.27 శాతం నష్టపోయి రూ. 1622 వద్ద స్థిరపడింది. ఈ పరిస్థితులపై సంస్థ పెద్ద డీల్స్​ వస్తున్నాయని, వ్యాపారానికి ఎటువంటి నష్టం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇన్ఫోసిస్ స్టాక్‌ను ఇప్పటికీ ‘కొనుగోలు’ చేయవచ్చని కోటక్ సెక్యూరిటీస్, జెఫరీస్, గోల్డ్‌మన్ శాక్స్ బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. రాబోయే కాలంలో మంచి మార్కెట్ వాటాను పొందేందుకు.. కంపెనీ తన పెట్టుబడులను పెంచినందు వల్ల తక్కువ త్రైమాసిక ఆదాయాలను నమోదు చేసిందని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ అభిప్రాయపడింది. ఈ పరిస్థితులు స్వల్పకాలానికి మాత్రమేనని.. భవిష్యత్తులో స్టాక్​ మళ్లీ పుంజుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి..

UPI: డెబిట్ కార్డులపై RBI కీలక నిర్ణయం.. త్వరలో యూపీఐ ద్వారా ATMలలో డబ్బు ఉపసంహరణ..

Stock Market: ఊగిసలాటలో కీలక సూచీలు.. లాభాల్లో ఆటో, మెటర్, గ్యాస్ షేర్లు..