Elon Musk: తన ట్విట్టర్ కొనుగోలు పూర్తైతే.. వారి జీతాల ఖర్చు సున్నా డాలర్లవుతుందన్న ఎలాన్ మస్క్..

Elon Musk: ట్విట్టర్ కంపెనీలో రెండవ అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ 43 బిలియన్ డాలర్ల చెల్లించి కంపెనీని కొనేందుకు ఆఫర్ చేశారు. తాజాగా ఆయన మరో సారి పోల్ నిర్వహించారు. ఈ సారి ఆయన ఏమన్నారంటే..

Elon Musk: తన ట్విట్టర్ కొనుగోలు పూర్తైతే.. వారి జీతాల ఖర్చు సున్నా డాలర్లవుతుందన్న ఎలాన్ మస్క్..
Elon Musk
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 19, 2022 | 12:05 PM

Elon Musk: ట్విట్టర్ కంపెనీలో రెండవ అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ 43 బిలియన్ డాలర్ల చెల్లించి కంపెనీని కొనేందుకు ఆఫర్ చేశారు. దీనిని అడ్డుకుని తనను తాను రక్షించుకోవడానికి సోషల్ మీడియా కంపెనీ “పాయిజన్ పిల్” పద్ధతిని పాటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మస్క్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ట్విట్టర్ కంపెనీకి తాను చేసిన బిడ్ విజయవంతమైతే.. బోర్డు సభ్యుల జీతాలు సున్నా డాలర్లవుతుందని ఆయన అన్నారు. దీని వల్ల తరువాతి సంవత్సరం నుంచి కంపెనీకి వారి జీతాల కోసం వెచ్చిస్తున్న 3 మిలియన్ డాలర్లు ఆదా అవుతుందంటూ బోర్డును విమర్శిస్తూ.. ఒక వినియోగదారు పోస్ట్‌కు ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు.

కంపెనీకి వ్యతిరేకంగా మస్క్ గురువారం తన 80 మిలియన్ల మంది ఫాలోవర్లకు ఒక పోల్ నిర్వహించారు. “$54.20 వద్ద ట్విట్టర్‌ను ప్రైవేట్‌గా తీసుకోవడం వాటాదారులకు చెందాలి బోర్డుకి కాదు” అని అడిగిన ప్రశ్నకు అనేక మంది సానకూలంగా స్పందిస్తూ “అవును” అంటూ బదులిచ్చారు. తర్వాత టెస్లా చీఫ్ ఎల్విస్ ప్రెస్లీ పాట “లవ్ మీ టెండర్” అని ట్వీట్ చేశారు.పాయిజన్ పిల్ అమలుతో 15% కంటే ఎక్కువ వాటా కొనుగోలుకు వాటాదారులు చేసే ప్రయత్నాలను నిరోధించడానికి తగ్గింపు రేటుకే షేర్లను విక్రయించే ప్రణాళికను Twitter ఎంచుకుంది. దీని వల్ల ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో కొత్తగా వాటాలను కొనలేక పోవటం వల్ల.. ప్రస్తుతం మస్క్‌కి 9.1% వాటా మాత్రమే కంపెనీలో ఉంది.

ట్విట్టర్ మాజీ CEO, సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఇది స్థిరంగా కంపెనీ పనిచేయకపోవడం అంటూ బోర్డును ఉద్దేశించి ట్విట్ చేశారు. వెంచర్ క్యాపిటలిస్ట్ గ్యారీ టాన్ “మీ బోర్డులోని తప్పు భాగస్వామి వల్ల అక్షరాలా ఒక బిలియన్ డాలర్ల విలువ ఆవిరైపోతుంది.” అంటూ చేసిన కామెంట్ కు ఇది సమాదానంగా ఉంది. ప్రస్తుతం ట్విట్టర్ షేర్ విలువ 4% పెరిగి 46.85 డాలర్లుగా ఉంది. ఏప్రిల్ 4న మస్క్ కంపెనీలో తన వాటా వివరాలను వెల్లడించినప్పటి నుంచి దాదాపు 15% షేర్ విలువ పెరిగింది. ఇదే సమయంలో.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ థామా బ్రావో ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ఆఫర్ కు మించిన బిడ్ చేసింది. కానీ ఈ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు వెల్లడి కాలేదు.

ఇవీ చదవండి..

Infosys shares: రూ. 40వేల కోట్లు కోల్పోయిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు.. షేర్లను ఉంచుకోవచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..

Mukesh Ambani: భారత కుబేరుడు ముకేష్‌ అంబానీ బర్త్‌ డే స్పెషల్‌.. అరుదైన ఫొటోలు..