RBI revises bank timings: బ్యాంక్ కస్టమర్లకు ‘బిగ్ అలర్ట్’.. టైమింగ్స్ మారాయి.. పూర్తివివరాలివే..!

RBI revises bank timings: బ్యాంకు ఖాతాదారులకు గమనిక. ఇక నుంచి బ్యాంకు ట్రేడింగ్ సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

RBI revises bank timings: బ్యాంక్ కస్టమర్లకు ‘బిగ్ అలర్ట్’.. టైమింగ్స్ మారాయి.. పూర్తివివరాలివే..!
Bank Timings
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 19, 2022 | 11:41 AM

RBI revises bank timings: బ్యాంకు ఖాతాదారులకు గమనిక. ఇక నుంచి బ్యాంకు ట్రేడింగ్ సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా కారణంగా కుదించిన బ్యాంక్ సేవల టైమింగ్స్‌ను.. ఇప్పుడు మళ్లీ పెంచారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన టైమింగ్స్ ప్రకారం.. బ్యాంకులు ఉదయం 9 గంటల నుంచే పనిచేయనున్నాయి. అయితే ముగింపు సమయంలో ఎలాంటి మార్పు చేయలేదు. భారతదేశంలో కోవిడ్ 19 కేసుల పెరుగుదల కారణంగా.. బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసింది రిజర్వ్ బ్యాంక్. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో.. బ్యాంకుల పని వేళలను పునరుద్ధరించింది. ఏప్రిల్ 18వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది ఆర్బీఐ.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 18 నుంచి తమ నియంత్రణలో ఉన్న మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటాయని కూడా ఆర్‌బీఐ తెలిపింది. ‘‘కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం, జనజీవనం సాధారణ స్థితికి రావడంతో సంక్షోభ కాలంలో కుదించిన బ్యాంకులు, మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది.’’ అని ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

RBI నియంత్రిత మార్కెట్లు.. సెంట్రల్ బ్యాంక్ ద్వారా నియంత్రణలో ఉన్న.. కాల్/నోటీస్/టర్మ్ మనీ, ప్రభుత్వ సెక్యూరిటీలలో మార్కెట్ రెపో, ప్రభుత్వ సెక్యూరిటీలలో ట్రై-పార్టీ రెపో, కమర్షియల్ పేపర్స్ అండ్ డిపాజిట్ సర్టిఫికెట్స్, కార్పొరేట్ బాండ్స్ రెపో, ప్రభుత్వ సెక్యూరిటీలు (కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, ట్రెజరీ బిల్లులు), ఫారెక్స్ డెరివేటివ్‌లతో సహా విదేశీ కరెన్సీ (FCY)/భారత రూపాయి (INR) ట్రేడ్‌లు మొదలైన వాటికి సంబంధించి ప్రారంభ, ముగింపు సమయ వేళలు తెలిపే చార్ట్‌ను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం పని వేళలు ఇలా ఉన్నాయి.

సవరించిన టైమింగ్స్.. కాల్/నోటీస్/టర్మ్ మనీ : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ప్రభుత్వ సెక్యూరిటీలలో మార్కెట్ రెపో : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 2.30 వరకు ప్రభుత్వ సెక్యూరిటీలలో ట్రై-పార్టీ రెపో : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు కమర్షియల్ పేపర్ అండ్ డిపాజిట్ సర్టిఫికెట్లు : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు కార్పొరేట్ బాండ్లలో రెపో : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ప్రభుత్వ సెక్యూరిటీలు (కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు మరియు ట్రెజరీ బిల్లులు) : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ఫారెక్స్ డెరివేటివ్‌లతో సహా విదేశీ కరెన్సీ (FCY)/భారత రూపాయి (INR) ట్రేడ్‌లు : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు రూపాయి వడ్డీ రేటు ఉత్పన్నాలు : ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు తెరుచుకుని ఉంటాయి.

Also read:

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Chanakya Niti: ఈ నాలుగు అలవాట్లు ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తాయి..!

Andhra Pradesh: రియల్ ‘గబ్బర్‌ సింగ్‌’.. గుర్రంపై స్వారీ.. ఆసక్తికరంగా మారిన ఎస్ఐ వీడియో..!