AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Viral Video: ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జంతువులు ఉన్నా.. మనుషులతో మమేకమై జీవించేది జంతువులు మాత్రమే. వాటిలోనూ ముఖ్యంగా ఇళ్లలో ఉంటూ

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..
Viral Video
Shiva Prajapati
|

Updated on: Apr 19, 2022 | 10:58 AM

Share

Viral Video: ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జంతువులు ఉన్నా.. మనుషులతో మమేకమై జీవించేది జంతువులు మాత్రమే. వాటిలోనూ ముఖ్యంగా ఇళ్లలో ఉంటూ ప్రజలతో కలిసి మెలిసి ఉండేవి పిల్లి, కుక్క అని చెప్పాలి. మిగతా జంతువులను కూడా మనుషులు సాదుతున్నప్పటికీ.. ఇవి మమేకం అయినంత మరే జీవి కూడా మమేకం కాలేవంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో.. ఆ రెండు జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. ఏదో ఒక సమయంలో ఏమరపాటు కారణంగా కిందపడే ఉంటారు. అయితే, కింద పడిన విషయాన్ని పట్టించుకోకుండా.. తమను ఎవరూ చూడలేదు కదా అని దిక్కులు చూసి ఆపై గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి జారుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. ఆ తరువాత చాటుకు వెళ్లి ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ తెరిపారా చూసుకుంటారు. అయితే, తాజాగా ఓ పిల్లికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ పిల్లి చేసిన పని.. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

సాధారణంగానే పిల్లి చాలా అల్లరిది. ఇంటిని వదిలి వెళితే చాటు.. ఇల్లంతా గుల్ల చేసి పెడుతుంది. అలా ఒకటేమిటి.. వందలకొద్ది చెప్పుకోవచ్చు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్లికి సంబంధించిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఆ వీడియోలో పిల్లి.. ఇంటి పై కప్పుపై నడుస్తోంది. అసలే కొంటె పిల్లి.. నేరుగా నడకుండా రివర్స్‌లో నడిచే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం కాస్తా విఫలైమంది. రివర్స్‌లో నడుస్తూ రూఫ్‌పై నుంచి కిందకు పడిపోయింది. అయితే, అంతపై నుంచి కిందపడిపోయినప్పటికీ పిల్లి తనకేమీ కానట్లు వ్యవహరించింది. ఎవరైనా చూస్తే పరువు పోతుందేమోనని భావించినట్లుగా.. సైలెంట్‌గా సైడ్‌కి వెళ్లిపోయింది. ఓ ట్రే చాటుకు వెళ్లిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 25వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

View this post on Instagram

A post shared by Cats ? (@cutekitye)

Also read:

Chanakya Niti: ఈ నాలుగు అలవాట్లు ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తాయి..!

Andhra Pradesh: రియల్ ‘గబ్బర్‌ సింగ్‌’.. గుర్రంపై స్వారీ.. ఆసక్తికరంగా మారిన ఎస్ఐ వీడియో..!

Funny Video: అయ్యయ్యో వద్దన్నా.. ఈ ఒక్కసారికి వదిలిపెట్టు.. పిల్లి ముందు మోకరిల్లిన ఎలుక..!