Funny Video: అయ్యయ్యో వద్దన్నా.. ఈ ఒక్కసారికి వదిలిపెట్టు.. పిల్లి ముందు మోకరిల్లిన ఎలుక..!
Funny Video: ప్రపంచంలో కోట్లాది జీవాలు ఉన్నాయి. వీటిలో చాలామటుకు పరాన్న జీవులే. ఒక జంతువు మరొకదానికి ఆహారం అవుతుంటాయి.
Funny Video: ప్రపంచంలో కోట్లాది జీవాలు ఉన్నాయి. వీటిలో చాలామటుకు పరాన్న జీవులే. ఒక జంతువు మరొకదానికి ఆహారం అవుతుంటాయి. అలాంటి వాటిలో మన కళ్ల ముందే ఉన్న కొన్ని జంతువులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కుక్క – పిల్లి, పిల్లి – ఎలుక మొదలైనవి. కుక్కకు పిల్లి ఎదురు పడితే అంతే సంగతి. అలాగే.. ఎలుక పిల్లికి ఎదురుపడితే అదే చివరి రోజు అవుతుందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక పిల్లి, ఎలుక పోరు ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎలుకను పట్టుకునేందుకు పిల్లి చేయని ప్రయత్నాలుండవు. అదే సమయంలో పిల్లి నుంచి తప్పించుకునేందుకు ఎలుక సైతం ఓ రేంజ్‌లో పరుగులు తీసి నానా హడావుడి చేస్తుంది. ఈ రెండింటి అల్లరి నేపథ్యంలోనే ప్రముఖ కార్టూన్ ఛానెల్స్.. టామ్ అండ్ జెర్రీ పేరుతో కార్టూన్ సిరీస్‌ను కూడా రన్ చేస్తున్నాయి. వాటిలో ఫన్ మామూలుగా ఉండదు.
ఇదిలాఉంటే.. తాజాగా ఓ పిల్లి, ఎలుకకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. పిల్లి, ఎలుక మధ్య జరిగిన సన్నివేశం నెటిజన్లు బాగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో పిల్లికి, ఎలుక చిక్కింది. మూడు వైపులా గోడ, మరోవైపు పిల్లి ఉండటంతో ఏం చేయాలో పాలుపోక గమ్మునుండిపోయింది ఎలుక. దీంతో ఛాన్స్ తీసుకున్న పిల్లి.. దానిని ఆరగించకుండా కాసేపు ఆటాడేసుకుంది. తనను పెరుగులుపెట్టిస్తావా? అన్నట్లు.. ఎలుకపై పిల్లి ఫుల్ ఫైర్ అయ్యింది. తన ముందరి కాళ్లతో ఎలుక మొహంపై పాట్ పాట్‌మని కొట్టింది. పిల్లి అంతలా కొడుతున్నా ఎలుక మాత్రం సైలెంట్‌గా, ధీనంగా పిల్లిని చూస్తూ ఉండిపోయింది. ‘అన్నా ఈ ఒక్కసారికి వదిలిపెట్టు’ అంటున్నట్లుగా పిల్లి ముందు మోకరిల్లింది ఎలుక. అయినా పిల్లి దాడిని కొనసాగించింది. ఆ దెబ్బలను తట్టుకోలేక ఎలుక.. వెనక్కి తిరికి బోరుమంది. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసి కొందరు పాపం అంటుంటే.. మరికొందరు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
View this post on Instagram
Also read:
Viral Video: పరోటాను చూసి.. పరుగులు తీసిన చైనా ఆర్మీ.. ఫన్నీ వీడియో మీకోసం..!
Andhra Pradesh: అద్భుతం.. సీతారాముల కళ్యాణానికి అతిధిగా వచ్చిన గరుడపక్షి..!
Soil Auction: గుప్పెడు మట్టికి రూ. 3.85 కోట్లు.. ఆ మట్టి స్పెషల్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..