Andhra Pradesh: అద్భుతం.. సీతారాముల కళ్యాణానికి అతిధిగా వచ్చిన గరుడపక్షి..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌‌లోని బాపట్ల జిల్లాలో గల ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Andhra Pradesh: అద్భుతం.. సీతారాముల కళ్యాణానికి అతిధిగా వచ్చిన గరుడపక్షి..!
Lord Rama
Follow us

|

Updated on: Apr 19, 2022 | 8:02 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌‌లోని బాపట్ల జిల్లాలో గల ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. అయితే ప్రతి ఏటా చైత్ర శుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణ వేడకల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదే, స్వామివారి కళ్యాణం రోజున స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదిక్షణలు చేసి వెళుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఓ గరుడ పక్షి ఆకాశంలో చక్కర్లు కొట్టింది.

కళ్యాణ క్రతువును ప్రారంభించిన సమయంలో ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా స్వామి వారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళ్లింది. భక్తులు గరుడపక్షిని చూసి భక్తితో మైమరచిపోయారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. కన్నులపండువగా నిర్వహించిన ఈ కళ్యాణ వేడకుల్లో స్వామి వారికి సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇక ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని, అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని స్థానిక పూజారులు తెలిపారు.

Also read:

Soil Auction: గుప్పెడు మట్టికి రూ. 3.85 కోట్లు.. ఆ మట్టి స్పెషల్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Tollywood Drugs Case: టాలీవుడ్‌ను వీడేదేలే అంటున్న ‘మత్తు’.. డ్రగ్స్ పోయి గంజాయ్ వచ్చే..

Big Shock: అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ వార్తపై కూడా ఓ లుక్కేయండి..!

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?