AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs Case: టాలీవుడ్‌ను వీడేదేలే అంటున్న ‘మత్తు’.. డ్రగ్స్ పోయి గంజాయ్ వచ్చే..

Tollywood Drugs Case: టాలీవుడ్‌ను డ్రగ్స్‌ వదలడం లేదు. డ్రగ్స్‌-డ్రగ్స్‌-డ్రగ్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ - ఐ అవాయిడ్‌ అని టాలీవుడ్‌ అంటుంటే, డ్రగ్స్‌ లైక్‌ మీ-ఐ కాంట్

Tollywood Drugs Case: టాలీవుడ్‌ను వీడేదేలే అంటున్న ‘మత్తు’.. డ్రగ్స్ పోయి గంజాయ్ వచ్చే..
Ganja
Shiva Prajapati
|

Updated on: Apr 19, 2022 | 7:03 AM

Share

Tollywood Drugs Case: టాలీవుడ్‌ను డ్రగ్స్‌ వదలడం లేదు. డ్రగ్స్‌-డ్రగ్స్‌-డ్రగ్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ – ఐ అవాయిడ్‌ అని టాలీవుడ్‌ అంటుంటే, డ్రగ్స్‌ లైక్‌ మీ-ఐ కాంట్ అవాయిడ్‌ అంటున్నారు కొందరు నటులు. అవును, డ్రగ్స్‌ భూతం టాలీవుడ్‌ను అస్సలు వదలట్లేదు. డ్రగ్స్‌ ఒక్కటేనా? గంజాయి కూడా తాగుతున్నారా? అంటే, అవుననే మాట ఇప్పుడు రీసౌండ్ వస్తోంది.

టాలీవుడ్‌ అసిస్టింట్‌ డైరెక్టర్‌ ఒకరు గంజాయి సప్లై చేస్తూ దొరికిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 190 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు అసిస్టెంట్‌ డైరెక్టర్ హాథిరామ్‌. యుద్ధం శరణం, కురుక్షేత్రం లాంటి సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసిన హాథిరామ్‌కు సినీ ప్రముఖులతో బాగానే పరిచయాలున్నాయనే మాట వినిపిస్తోంది. దాంతో, టాలీవుడ్‌లో డ్రగ్స్‌తో పాటు గంజాయి కూడా విచ్చలవిడిగా సప్లై అవుతుందనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది.

సినీ ఆర్టిస్టులకు హాథిరామ్‌ గంజాయి సప్లై చేస్తున్నట్లు పోలీసుల ఇంటరాగేషన్‌లో తేలింది. హాథిరామ్‌తోపాటు ఆరుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కర్నాటక నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పట్టుకున్నారు.

చాలా కాలంగా హాథిరామ్‌ గంజాయి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఒకపక్క సినీ ఫీల్డ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూనే, మరోపక్క సైడ్‌ బిజినెస్‌గా గంజాయి రవాణా చేస్తున్నట్లు తేల్చారు. అయితే, ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే. టాలీవుడ్‌లో ఎవరెవరికి హాథిరామ్‌ గంజాయ్‌ సప్లై చేశాడు. ఎవరెవరు గంజాయి తాగుతున్నారు? అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

హైదరాబాలో గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటకకు గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన మీరపేట పొలీసులు. పట్టుబడ్డ నిందితుడు యుద్ధం శరణం, కురుషేత్రం సినిమాలకు ఆసిస్టెంట్‌ డైరెక్టర్ గా పని చేస్తున్న బొడ్డ హాథిరామ్‌గా చెబుతున్నారు,ఆరుగురు వ్యక్తులు అరెస్టు చేసిన పోలీసులు వీరి వద్ద నుండి 190 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనంచేసుకున్నారు.

Also read:

MellaChervu: మై హోమ్ ఇండస్ట్రీస్‌లో కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవాలు.. హాజరైన జూపల్లి దంపతులు

Big Shock: అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ వార్తపై కూడా ఓ లుక్కేయండి..!

Anand Mahindra: 10 నిమిషాల్లో డెలివరీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..