AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భార్యాభర్తల పంచాయితీ..! మంచం మీద సీన్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్

Wife and husband funny video: సోషల్ మీడియాలో ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా భార్యాభర్తలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: భార్యాభర్తల పంచాయితీ..! మంచం మీద సీన్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్
Wife Husband Funny Video
Shaik Madar Saheb
|

Updated on: Apr 19, 2022 | 8:43 AM

Share

Wife and husband funny video: సోషల్ మీడియాలో ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా భార్యాభర్తలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత మీరు కూడా నవ్వుతారు.. ఎందుకంటే ఇక్కడ ఒక భార్య తన భర్తతో గొడవపడి మంచం మీద గోడను కట్టింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతూనే ఉంటాయి. ఇది కొత్త విషయం కానప్పటికీ.. కొన్నిసార్లు గొడవలు పరిస్థితి అదుపు తప్పేలా చేస్తాయి. ఇటీవల కాలంలో నెట్టింట భార్యాభర్తల గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే.. ఈ వీడియోలో ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాత భార్య మంచం మధ్యలో గోడ కడుతుంది. దీన్ని చూసి (Social Media) నెటిజన్లు నవ్వుకోవడంతోపాటు ఫుల్లుగా షేర్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. భార్యాభర్తలు ఒకరినొకరు కోపంగా చూసుకోవడాన్ని చూడవచ్చు. భార్య తనకు.. తన పక్కన కూర్చున్న భర్తకు మధ్య తాపీతో గోడ కట్టడాన్ని చూడవచ్చు. ఈ క్లిప్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మహిళ ఈ గోడను ఇటుకలు.. సిమెంట్‌తో నిర్మిస్తోంది. అయితే పక్కన కూర్చున్న భర్త తన భార్య చర్యతో చాలా కోపంగా ఉన్నాడు. వీరిని చూస్తుంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది.

వైరల్ వీడియో..

ఈ వీడియోను rising.teching అనే యూజర్ ద్వారా Instagramలో షేర్ చేయగా.. నెటిజన్లు అదిరిపోయే రియాక్షన్‌లు ఇస్తున్నారు. భార్యాభర్తలన్నాక గొడవలు కామన్ అని.. గోడ కట్టే బదులు తమలో తాము మాట్లాడుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ పోరాటం కొంత వరకేనంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: పరోటాను చూసి.. పరుగులు తీసిన చైనా ఆర్మీ.. ఫన్నీ వీడియో మీకోసం..!

Bones health: ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ పండ్లను తీసుకోవడం మర్చిపోవద్దు..