Basha Shek | Edited By: Anil kumar poka
Updated on: Apr 19, 2022 | 8:21 AM
ఆపిల్: దీనిలో విటమిన్ సి, క్యాల్షియంతో పలు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే రోజుకు ఒక ఆపిలైనా తినాలని నిపుణులు సూచిస్తుంటారు. ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆపిల్స్‌ను బాగా తినాలి.
అరటి పండ్లు: కీళ్ల నొప్పులు లేదా శరీరంలో తిమ్మిరి సమస్యలు ఉన్నవారు రోజూ అరటిపండ్లను తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందులో ఉండే పోషకాలు ఎముకలు, దంతాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఒకప్పుడు కీళ్ల నొప్పులు లేదా ఒళ్లు నొప్పులు కేవలం వృద్ధులకే వచ్చేవి. అయితే ప్రస్తుత కాలంలో యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని పండ్లను తరచుగా తీసుకోవడం ద్వారా ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చు.
పైనాపిల్: ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని యాసిడ్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఫలితంగా బాడీలో క్యాల్షియం స్థాయులు పెరుగుతాయి. వేసవిలో పైనాపిల్ ను ఎక్కువగా తీసుకోవాలి.
స్ట్రాబెర్రీ: శరీరానికి చాలా ముఖ్యమైన మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి మాత్రమే కాకుండా, ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా ఈ పండ్లలో ఉంటాయి. వేసవిలో, మీరు స్ట్రాబెర్రీలు, పాలతో కలిపి తయారు చేసిన షేక్ తాగవచ్చు. పాలు కూడా ఎముకలను కూడా ఫిట్‌గా మారుస్తాయి.
పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.