- Telugu News Photo Gallery Health tips These bad habits can create energy issue in diabetes patient in Telugu
Health care: మధుమేహ రోగులు ఈ అలవాట్లకు దూరంగా ఉండాల్సిందే.. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు..
Health tips for Diabetes patient: అనారోగ్యకరమైన జీవనశైలి పలు సమస్యలను తెచ్చిపెడుతుంది. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతాయి.
Updated on: Apr 19, 2022 | 8:47 AM

డయాబెటిక్ రోగులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. తినే ఆహారంతో పాటు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చిన్న పని చేసినా త్వరగా అలసటకు గురవుతారు. దీనికి తోడు శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయులు పెరుగుతాయి.

ఈ అలవాట్లు మధుమేహ రోగులను మరింత అనారోగ్యానికి గురి చేస్తాయి

తగినంత నీరు తాగకపోవడం: తగినంత నీరు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా త్వరగా అలసటకు గురవుతారు. అందుకే రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

సరిగ్గా నిద్రపోకపోవడం: డయాబెటిక్ పేషెంట్ల నిద్ర విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిపుణుల సూచనల మేరకు కనీసం 8 గంటలు తప్పకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి. లేకపోతే అలసట తరచూ ఇబ్బంది పెడుతుంది.

మధుమేహ రోగులు క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు, ఎక్సర్ సైజులు చేయాలి. ఫలితంగా పనుల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అయితే కొంతమంది వీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

మధుమేహం ఉన్నప్పటికీ చాలామంది జిహ్వా చాపల్యాన్ని అదుపులో పెట్టుకోలేరు. స్వీట్స్, నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయులను మరింత పెంచుతాయి. ఫలితంగా త్వరగా అలసిపోతారు.




