AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golla Babu Rao: నిన్నేమో హింసావాది.. ఇవాళ అహింసావాది.. అధిష్ఠానంపై ఎమ్మెల్యే గరం.. అంతలోనే మారిన గళం..

తనకు మంత్రి పదవి రాకపోవడంపై పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఘాటుగా స్పందించారు.

Golla Babu Rao: నిన్నేమో హింసావాది.. ఇవాళ అహింసావాది.. అధిష్ఠానంపై ఎమ్మెల్యే గరం.. అంతలోనే మారిన గళం..
Mla Golla Baburao
Balaraju Goud
|

Updated on: Apr 19, 2022 | 11:32 AM

Share

Payakaraopeta MLA Golla Baburao: తనకు మంత్రి పదవి రాకపోవడంపై పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పందించారు. అధిష్టానం దెబ్బ కొట్టింది.. నేనూ దెబ్బ కొడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను అధిష్టానం అమాయకుడని అనుకుంటుందని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో గ్రామ వార్డు వాలంటీర్ సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మారాయి.

తనకు మంత్రి పదవి రాకపోవడంపై పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు .తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు . తనకు మంత్రి పదవి రాకుండా అధిష్టానం అడ్డుకుందని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తాంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మాట కోసం తాను వైఎస్సార్సీపీలో చేరానని.. వైఎస్సార్ చనిపోయిన తరువాత హింసావాదంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యాయన్నారు . పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని.. అయితే తనను అమాయకుడిగా భావించి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తాను అమాయకుడిని కాదని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానన్నారు. మంత్రి పదవి రాకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తాను కూడా దెబ్బ కొట్టి చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు వార్డు సభలో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రశపెట్టే ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు చేకూరాలనే ఉద్దేశంతో సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే జనాలకు సేవ చేసే ఒక సైన్యం లాంటిదని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలంటే వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉందన్నారు.

అధిష్టానానికి నెంబర్ వన్ విధేయుడ్నిః బాబురావు

ఇదిలావుంటే, తన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గొల్ల బాబురావు వివరణ ఇచ్చారు. నా మాటలు వక్రీకరించ్చారని.. అధిష్టానానికి నెంబర్ వన్ విధేయుడ్ని నేను.. నాపై దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. మంత్రి పదవి రానందుకు బాధలేదు.. అయితే నియోజక వర్గంలో ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం, ఇబ్బందిని ఎదుర్కోవడానికి ఆ పదం వాడానే తప్పా.. అందులో వేరే ఉద్దేశం లేదన్నారు.

నా ఉద్దేశంలో అహింసావాదమంటే మాకు జరిగే అధర్మాన్ని ఎదుర్కోవడం.. హింసావాదామంటే ప్రజలు, కేడర్ కు జరుగుతున్న అన్యాయం పై ముందుండి పోరాటం చేయడమే నా లక్ష్యమన్నారు. నాకు టికెట్ రాకుండా చాలా మంది ప్రయత్నించినా సీఎం వైఎస్ జగన్ ఆదరించ్చారన్నారు. ఆనాడు వై ఎస్ ఎలా ఆదరించ్చారో.. జగన్ కూడా ఆనాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. వైసీపీ అభ్యున్నతి కృషీ చేస్తానని బాబురావు స్పష్టం చేశారు.

Read Also…  Prashant Kishor: తడబడుతున్న కాంగ్రెస్ ‘హస్తం’కి ప్రశాంత్ కిషోర్ మద్దతు! 3 రోజుల్లో రెండు సార్లు సోనియా గాంధీతో భేటీ