NSTL Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీలో ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని డీఆర్డీఓ - నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ (NSTL).. జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF Vacancy) ఖాళీల భర్తీకి..
DRDO NSTL Visakhapatnam Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని డీఆర్డీఓ – నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ (NSTL).. జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF Vacancy) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 8
పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
స్టై పెండ్: నెలకు రూ.31,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వ్యాలిడ్ నెట్/గేట్ స్కోర్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: admin.dept.nstl@gov.in
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: