AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amith Shah: ఢిల్లీకి చేరిన సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం.. రంగంలోకి కేంద్ర హోం మంత్రి అమిత్​షా..

Amith Shah call: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహరం తెలంగాణ వ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు..

Amith Shah: ఢిల్లీకి చేరిన సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం.. రంగంలోకి కేంద్ర హోం మంత్రి అమిత్​షా..
Amith Shah
Narender Vaitla
|

Updated on: Apr 19, 2022 | 3:57 PM

Share

Amith Shah: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహరం తెలంగాణ వ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అక్రమంగా 16 కేసులు నమోదు చేయించారంటూ, ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సాయి గణేష్‌ చెప్పిన మాటలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి గణేష్‌ ఏప్రిల్‌ 14న చికిత్స పొందుతూ మరణించారు. దీంతో బీజేపీ ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకొని టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెంచుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశం ఏకంగా ఢిల్లీకి చేరింది. సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఫోన్‌ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంగళవారం బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి సాయి గణేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగానే సాయి గణేష్‌ ఆత్మహత్య విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే స్పందించిన అమిత్‌ షా సాయి గణేష్‌ కుటుంబ సభ్యులను ఫోన్‌లో మాట్లాడించారు.

ఇదిలా ఉంటే మరణానికి ముందు తన ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కారణమంటూ సాయి గణేష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సాయి గణేష్ మీడియాకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఫ్లెక్సీలను చింపేసి ఆందోళనలు చెప్పటి విషయం తెలిసిందే.

Also Read: AP 10th class Hall Tickets 2022: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Infosys shares: రూ. 40వేల కోట్లు కోల్పోయిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు.. షేర్లను ఉంచుకోవచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..