RapidEVChargeE: ఎలక్ట్రిక్‌ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. ర్యాపిడ్‌ ఈవీ చార్జింగ్ యూనిట్‌!

RapidEVChargeE: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలకు తగినట్లుగానే చార్జింగ్‌ పాయింట్లు కూడా..

RapidEVChargeE: ఎలక్ట్రిక్‌ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. ర్యాపిడ్‌ ఈవీ చార్జింగ్ యూనిట్‌!
Follow us

|

Updated on: Apr 19, 2022 | 9:52 PM

RapidEVChargeE: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలకు తగినట్లుగానే చార్జింగ్‌ పాయింట్లు కూడా క్రమ క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాప్ట్‌వేర్‌ అప్లికేషన్ల తయారీ కంపెనీ ర్యాపిడ్‌ ఈవీచార్జ్‌ఈ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric vehicles) చార్జర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఫౌండర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శివసుబ్రమణియం వెల్లడించారు. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 600 వరకు చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

2026 నాటికి రెండు మిలియన్ల ఎలక్ట్రిక్‌ వాహనాల అవసరాలను తీర్చడానికి భారతదేశంలో దాదాపు 4 లక్షల వరకు చార్జింగ్‌ స్టేషన్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్న ప్లాంట్‌లో చార్జర్లు తయారవుతున్నాయని, వీటికి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఫ్రాంచైజ్‌ పద్దతిన ఉత్పత్తి చేయడం అంత సులువుకాదని తెలిపారు. చార్జింగ్‌ స్టేషన్ల కొరతను తీర్చేందుకు కంపెనీ తెలంగాణతో పాటు ఏపీలోనూ వచ్చే ఏడాదిన్నర కాలంలో వెయ్యి చార్జింగ్‌ స్టేషణ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

చార్జింగ్‌ టారిఫ్‌ను రూ.8 నుంచి రూ.25 మధ్యలో నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ పోల్‌ చార్జింగ్‌ స్టేషన్లు లాగా ఉండే ఈ చార్జింగ్‌ స్టేషన్లలో పవర్‌ సాకెట్‌, మినీ స్క్రీన్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌తో కూడా చార్జింగ్‌ చేసుకునే వీలుంటుంది. యాప్‌తో స్లాట్‌ బుకింగ్‌తోపాటు చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఇలాంటి సదుపాయాలను ఇప్పటికే కోయంబత్తూరులో అందుబాటులో ఉండగా, త్వరలో ఇక్కడ కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!

Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు

Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ