Fire Accident: బేగంబజార్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. భారీ ఎత్తున మంటలు.. క్షణాల్లోనే దగ్ధమైన ఇన్నోవా..

Hyderabad: హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీనా హోటల్, బేకరీ పక్కన ఓ ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమైంది.

Fire Accident: బేగంబజార్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. భారీ ఎత్తున మంటలు.. క్షణాల్లోనే దగ్ధమైన ఇన్నోవా..
Fire Accident
Follow us
Basha Shek

|

Updated on: Apr 20, 2022 | 5:12 AM

Hyderabad: హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీనా హోటల్, బేకరీ పక్కన ఓ ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అగ్ని ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ట్రాన్మ్‌ఫార్మర్‌ పేలిన సమయంలో రోడ్డుపై పార్క్‌ చేసిన ఇన్నోవా కారు క్షణాల్లోనే దగ్ధమైంది. కాగా విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే!

‘ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నిప్పురవ్వలు వెలువడుతుంటే విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చాం. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేసి వెళ్లారు. అయితే తిరిగి కొద్దీ సేపటికే మళ్లీ ట్రాన్మ్‌ఫార్మర్‌లో నిప్పురవ్వలు ప్రారంభమయ్యాయి. ఉన్నట్లుండి అవి పెద్దగా మారాయి.దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం’ అని స్థానికులు మండిపడుతున్నారు. కాగా ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కాగా ప్రమాదం జరిగిన స్థలానికి జాంబాగ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ చేరుకొని స్థానికులను అడిగి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.మరోవైపు బేగంబజార్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: Viral Video: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చి పక్కనే కుర్చున్న బస్సు డ్రైవర్.. చివరకు..

‘అరబిక్ కుతు’ పాటకు దుమ్మురేపిన పీవీ సింధు..

PM Modi: భారత సాంప్రదాయ వైద్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు.. WHO చీఫ్‌ టెడ్రోస్‌తో కలిసి మోదీ టూర్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!