Criminal Procedure: భారత రాష్ట్రపతి కీలక నిర్ణయం.. క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022కు ఆమోదం..!
అరెస్టు సమయంలో నిందితుల భౌతిక, శారీరక, జీవ సంబంధిత నమూనాలను సేకరించేందుకు పోలీసులకు అధికారం లభిస్తుంది. ఈ చట్టం ఖైదీల గుర్తింపు చట్టం, 1920 స్థానంలో దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
Criminal Procedure – 2022 Bill: క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు 2022కి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath Kovind) ఆమోదం తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి రావడంతో అరెస్టు సమయంలో నిందితుల భౌతిక, శారీరక, జీవ సంబంధిత నమూనాలను సేకరించేందుకు పోలీసులకు అధికారం లభిస్తుంది. ఈ చట్టం ఖైదీల గుర్తింపు చట్టం, 1920 స్థానంలో దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏప్రిల్ 4న లోక్‌సభ, ఏప్రిల్ 6న రాజ్యసభ ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు.
క్రిమినల్ కేసుల విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న నిందితుల ఫొటోలు, వేలిముద్రలు, పాదముద్రలు, శారీరక కొలతలు, సంతకాలు, చేతి రాత, వెంట్రుకలు, రక్తం, డీఎన్‌ఏ పరీక్షలకు అవసరమయ్యే ఇతర నమూనాలను సేకరించే అధికారం ఈ చట్టం ద్వారా పోలీసులకు మార్గం సుగమం కానుంది. ఎవరి నుంచయినా వీటిని సేకరించాలని మేజిస్ట్రేట్ కూడా ఆదేశించవచ్చు. ఈ నమూనాలు ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. తీవ్ర నేరాలే కాకుండా, ఎలాంటి నేరం చేసినవారైనా ఈ సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సి ఉంటుంది. కేసు విచారణ ముగిసి నిందితులు నిర్దోషులుగా బయటపడినా, కేసులను కోర్టులు కొట్టివేసినా ఈ వివరాలను తొలగించాలి..
కొత్త చట్టం ప్రకారం.. ఏ విధమైన డేటాను సేకరించవచ్చు, ఎవరి నుండి డేటాను సేకరించవచ్చు. అటువంటి డేటాను సేకరించడానికి ఎవరు ఆదేశించగలరు అనే విషయాన్ని కూడా చట్టం వివరిస్తుంది. కేంద్ర డేటాబేస్‌లో డేటా సేకరిస్తామని కూడా పేర్కొంది. 1920 చట్టంతో పాటు 2022 చట్టంలోనూ ప్రతిపక్షం లేదా డేటా ఇవ్వడానికి నిరాకరించడం ప్రభుత్వ అధికారి పనిని అడ్డుకోవడం నేరంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ బిల్లుకు సంబంధించి రాజ్యసభలో చర్చ సందర్భంగా, రాజకీయ ఖైదీల బయోమెట్రిక్ డేటా సేకరించబడదని, అయితే క్రిమినల్ కేసులో పట్టుబడితే వారిని సాధారణ పౌరులుగా చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే, బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ పరీక్షలను చట్టం పరిధి నుండి దూరంగా ఉంచుతారు.
సీఏ, సీఎస్‌లకు సంబంధించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల చట్టాలను సవరించే చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం కూడా లభించింది. మూడు వృత్తుల అత్యున్నత సంస్థల పనితీరులో గణనీయమైన మార్పులను అందించడానికి మరియు మరింత పారదర్శకతకు హామీ ఇచ్చే బిల్లును ఏప్రిల్ 5న పార్లమెంటు ఆమోదించింది.
Read Also…. AP Rains: ఏపీలో మండువేసవిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. నేలకూలిన చెట్లు.. విద్యుత్‌కు అంతరాయం