AP Rains: ఏపీలో మండువేసవిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. నేలకూలిన చెట్లు.. విద్యుత్‌కు అంతరాయం

AP Rains: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఓ వైపు భానుడు భగభగలతో ప్రజలు ఉక్కపోత... మరోవైపు వివిధ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో(Heavy Rains) ఇబ్బందిపడుతున్నారు..

AP Rains: ఏపీలో మండువేసవిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. నేలకూలిన చెట్లు.. విద్యుత్‌కు అంతరాయం
Ap Rains
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2022 | 6:32 AM

AP Rains: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఓ వైపు భానుడు భగభగలతో ప్రజలు ఉక్కపోత… మరోవైపు వివిధ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో(Heavy Rains) ఇబ్బందిపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనంతరం, తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరవకొండ లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలలో చెట్లు, కటౌట్ లు నెలకొరిగాయి. కుడేరు మండలం చోళ సముద్రం గ్రామం లో కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది భారీ శబ్దం తో పడిన పిడుగు దెబ్బకు జనం హడలి పోయారు.ఐతే ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు కానీ చెట్టు మొత్తం భారీగా మంటలు చెలరేగాయి .మొత్తం మీద భానుడి ప్రతాపం తో ఎండ వేడి నుండి ప్రజలకు ఈ వర్షం చల్లటి ఉపశమనం కలిగించింది.

మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలికి పలుచోట్ల భారీ చెట్లు నేలకూలాయి. ఈదురుగాలులకు ఇళ్లు, దుకాణాల రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రిలో ఈదురుగాలతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది.

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు సబ్ డివిజన్ పరిదిలోని ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. భారీ ఎదురు గాలులతో రేకుల షేడ్ల రేకులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, చెట్లు నేలకొరిగాయి. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది.. చర్యలు చేపట్టారు.

Also Read: Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా.? అయితే ఇలా మార్చుకోవచ్చు.. ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే..