Chandrababu Birth Day: నేడు చంద్రబాబు పుట్టిన రోజు.. చంద్రన్న కథాగానం సాంగ్‌ను కానుకగా ఇచ్చిన ఫ్యాన్స్
Chandrababu Birth Day: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు తన 73వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. 28 ఏళ్ల వయసులో ..
Chandrababu Birth Day: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు తన 73వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. 28 ఏళ్ల వయసులో ఉమ్మడి ఆంధప్రదేశ్ (Andhra Pradesh) లో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా పేరు గాంచారు. ఏపీ ముఖ్యమంత్రిగాను పనిచేశారు. ఈరోజు చంద్రబాబు పుట్టిన సందర్భంగా పార్టీ అభిమానులు ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. సినీ గీతం తరహాలో చంద్రన్న కథాగానం అంటూ చంద్రన్నా, పెద్దన్నా అంటూ సాగే ఓ గీతం ప్రోమోను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. అధినేత పుట్టిన రోజంటే పార్టీ శ్రేణులకు పండుగే కదా! అందునా తమ అధినేత గురించి ఎంతో గర్వంగా చెప్పుకునే టిడిపి కార్యకర్తలకు మరింత మహదానందకరం అంటూ కామెంట్ జత చేసి ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో టీటీడీ పార్టీ శ్రేణులనే కాకుండా సామాన్య జనాన్ని కూడా ఆకట్టుకుంటుంది. ట్వీట్స్, రీ ట్విట్స్ తో హోరెత్తిస్తున్నారు.
చల్లని తల్లి అమ్మణమ్మా తొలిసూరు కొడుకువు అంటూ సాగుతున్న ప్రోమో కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమోలో తల్లిదండ్రులతో ఉన్న చంద్రన్న.. ఆయన రాజకీయ ప్రస్థానం ఉన్నాయి. చంద్రన్న పుట్టిన రోజంటే పార్టీ శ్రేణులకు పండుగే అని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు అభిమానులు కార్యకర్తలు..
అధినేత పుట్టిన రోజంటే పార్టీ శ్రేణులకు పండుగే కదా! అందునా తమ అధినేత గురించి ఎంతో గర్వంగా చెప్పుకునే టిడిపి కార్యకర్తలకు మరింత మహదానందకరం. (1/2) pic.twitter.com/TVOpQ0ZxSP
— Telugu Desam Party (@JaiTDP) April 19, 2022
Also Read: AP Rains: ఏపీలో మండువేసవిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. నేలకూలిన చెట్లు.. విద్యుత్‌కు అంతరాయం