06 December 2025

జర జాగ్రత్త.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే!

samatha

Pic credit - Instagram

అధిక కొలెస్ట్రాల్ అనేది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

మన శరీరానికి కొలెస్ట్రాల్ అనేది అవసరం కానీ, కొన్ని సార్లు అది రక్తంలో ఎక్కువగా పెరిగినప్పుడు అనేక సమస్యలకు కారణం అవుతుంది. 

అందుకే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా అధిక కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనం శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఏ లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి ఎక్కువగా పెరిగిపోతే, అది శరీర అవయవాలకు తగినంత ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. దీంతో ఆకస్మిక అలసట, బలహీనత వంటి సమస్యలు ఎదురు అవుతాయి.

అధిక కొలెస్ట్రాల్ అనేది సిరల్లో అడ్డంకులకు కారణం అవుతుంది. దీని వలన తిమ్మిరి, జలదరింపు, ఎక్కువ చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు. దీని వలన గుండెకు సరిగ్గా రక్త ప్రసరణ అందదు. దీంతో ఛాతి నొప్పి, భారం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

అధిక కొలెస్ట్రాల్ అనేది కాలేయ , జీర్ణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. దీని వలన ఆకలి మందగించడం, కుడుపు నొప్పి వాయువుకు కారణం అవుతుంది. ముఖ్యంగా వీరు ఆహారం చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు.

అధిక కొలెస్ట్రాల్ అనేది కొలెస్ట్రాల్ హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. దీనివలన ఆకస్మిక మానసిక మార్పలు వంటి సమస్యలు తలెత్తుతాయి.