- Telugu News Photo Gallery Spiritual photos Mars transit brings good luck to those born under the four zodiac signs
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
నవ గ్రహాల్లో కుజ గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఈ గ్రహం ఒకటి. అయితే అతి త్వరలో కుజ గ్రహం సంచారం చేయనుంది. కాగా, కుజ గ్రహ సంచారంతో నాలుగు రాశుల వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 06, 2025 | 7:35 PM

కుజ గ్రహం డిసెంబర్ 7న ధనస్సు రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా కలిసి రానున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహ సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి ఉద్యోగులు ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ప్రమోషన్‌తో పాటు, జీతం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి కష్టానికి తగిఫలితం లభిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది.

తుల రాశి : తుల రాశి వారికి అద్భుతమైన ఫలితాలు చేకూరనున్నాయి. వీరికి కుజ గ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నందున, మానసిక ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతవరణం నెలకుంటుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి కుజ గ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి ఐదవ స్థానంలో కుజుడు ప్రవేశించడం వలన వీరికి ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతంది. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం బాగుటుంది. పెట్టుబడుల వలన అనే లాభాలు వస్తాయి.

మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి ఉద్యోగులకు అద్భుతంగా ఉండనుంది.



