Sarpanch Elections: నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్ అభ్యర్థి హామీ!
Sarpanch Elections: స్థానిక సమరంలో గెలవడానికి అభ్యర్థులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చిత్ర విచిత్ర హామీలు ఇస్తూన్నారు. ఒకరిని మించి ఒకరు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కోతుల..

Sarpanch Elections: స్థానిక సమరంలో గెలవడానికి అభ్యర్థులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చిత్ర విచిత్ర హామీలు ఇస్తూన్నారు. ఒకరిని మించి ఒకరు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కోతుల బెడద తీరుస్తాము అని హామీలు ఇచ్చారు. అయితే సిద్దిపేట జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి తనను గెలిపిస్తే గ్రామంలో కుక్కల బెడద నుండి విముక్తి కల్పిస్తాను అని హామీ ఇస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) బొప్పాపూర్ గ్రామ సర్పంచి అభ్యర్థి భాను ప్రసాద్ వినూత్నంగా ఆలోచించి హామీలు ఇస్తున్నాడు. ఇటీవలి కాలంలో చాలా చోట్ల కుక్కల దాడులు పెరిగి చాలా మంది ప్రాణాలు పోవడం.. తీవ్రంగా గాయాలు అవుతున్నాయి. కాగా గతంలో బొప్పాపూర్ గ్రామంలో కూడా విధి కుక్కల దాడిలో కొంతమంది గాయపడ్డారు. అయితే తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో వీధి కుక్కలు లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చాడు. గ్రామంలో గుంపులు, గుంపులుగా సంచరించి విద్యార్థులపై గ్రామస్తులపై రైతులపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయని, గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటి బెడద నుండి విముక్తి కల్పిస్తాను అని హామీ ఇస్తున్నాడు.
ఇది కూడా చదవండి: High Court: భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!
గ్రామ సర్పంచిగా తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో ఉన్న కుక్కలను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి గ్రామంలో కుక్కల బెడద లేకుండా చూస్తానని హామీ ఇచ్చాడు. మరి గెలిస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా? లేదో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: PAN Card: బిగ్ అలర్ట్.. జనవరి నుంచి ఈ పాన్ కార్డులు చెల్లవు.. అప్పుడేం చేయాలి?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
