AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు.. ఆ ఇద్దరినీ మర్చిపోయారు కదా

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలపడంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్ రౌండర్లు శివం దూబే, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు. దూబే మెరుపు బ్యాటింగ్, అక్షర్ పటేల్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనలతో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించి భారత్ విజయంలో భాగమయ్యారు.

Team India: శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు.. ఆ ఇద్దరినీ మర్చిపోయారు కదా
T20i Wc 2026
Ravi Kiran
|

Updated on: Mar 11, 2026 | 6:45 PM

Share

సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా. ప్రస్తుత క్రికెట్ ప్రపంచం మొత్తం 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత విజయం కోసం ఈ ముగ్గురి గురించే మాట్లాడుకుంటోంది. వీరి అద్భుత ప్రదర్శన వల్లే భారత్ ఈ కప్‌ను గెలిచిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, వీరితో పాటు మరో ఇద్దరు సైలెంట్ హీరోలు కూడా ఉన్నారు. టీమిండియా మూడోసారి విశ్వవిజేతగా నిలవడంలో ఈ ఇద్దరు ఆల్ రౌండర్లు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతితో వికెట్లు తీయడం, బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం వారి ప్రత్యేకత. వారే ఆల్ రౌండర్లు శివం దూబే, అక్షర్ పటేల్.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

ఈ టోర్నీ మొత్తం శివం దూబే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వారు ఆరంభంలో దూకుడుగా ఆడితే, దూబే చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి తన పని తాను చేసుకుపోయేవాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం విఫలమైనా, దూబే మాత్రం రాణించాడు. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. సెమీఫైనల్‌లో సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దూబే భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

అదే విధంగా ఫైనల్‌లో కూడా దూబే తన బ్యాట్‌ను ఝులిపించాడు. 16వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ఎనిమిది బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా జిమ్మీ నీషమ్ వేసిన చివరి ఓవర్లో అతడు ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ 255 పరుగుల భారీ స్కోర్‌ను అందుకోగలిగింది. దూబే మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో 235 పరుగులు చేశాడు. దూబే ఆడిన చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు ఈ రోజు భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాయి.

ఇది చదవండి: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

ఇక భారత్ ఫైనల్ చేరి కప్పు కొట్టడంలో అక్షర్ పటేల్‌ది కీలక పాత్ర. వాంఖెడే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అక్షర్ పటేల్ బంతితో ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, ఫీల్డింగ్‌లో మాత్రం అద్భుతాలు చేశాడు. అక్షర్ సంచలన క్యాచ్‌లతో హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ వంటి విద్వాంసకర ప్లేయర్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఒకవేళ అక్షర్ ఆ క్యాచ్‌లను అందుకోకపోయి ఉంటే కథ మరోలా ఉండేది. అప్పుడు ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించే అంత పని అయిపోయేది. ఫైనల్ మ్యాచ్‌లోనూ అక్షర్ పటేల్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ వంటి ప్రమాదకర ప్లేయర్‌లను అవుట్ చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచకప్‌లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా అటు దూబే, ఇటు అక్షర్ పటేల్ టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో తమ వంతు పాత్ర పోషించి, జట్టు విజయంలో భాగమయ్యారు.

ఇది చదవండి: మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే డబ్బే డబ్బు..

Follow Us
శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..
శాంసన్, బుమ్రా, ఇషాన్ కాదు.! వాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్‌లు..
గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్
గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం నుంచి కీలక ప్రకటన.. కొత్త డెసిషన్
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!