పప్పులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు.
అయితే పప్పులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికి కొన్ని సమస్యలు ఉన్నవారు అస్సలే వాటిని తినకూడదంట. కాగా, దాని గురించే తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు నడవడానికి కూడా కష్టం కావచ్చును.
అందువలన యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడే వారు అస్సలే కొన్ని రకాల పప్పులు తినకూడదంట. కాగా యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడే వారు ఏ పప్పులు తినకూడదో చూద్దాం
నల్ల మినప పప్పు ఇందులో ఫ్యూరిన్లు అధికంగా ఉంటాయి. అందువలన యూరిక్ యాసిడ్‌తో బాధపడే వారు అస్సలే నల్ల మినపప్పు తినకూడదు
కంది పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులకు కారణమయ్యే ప్యూరిన్లు కూడా ఉంటాయంట.
శనగపప్పులో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్యూరిన్ ఎక్కవగా ఉంటుంది. కీళ్ల, మోకాళ్ల సమస్యలతో బాధపడే వారు వీటిని అస్సలే తినకూడదు.
పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన యూరిక్ యాసిడ్‌తో బాధపడే వారు వీటిని అస్సలే తినకూడదంట.