Covid Insurance Scheme: హెల్త్ వర్కర్స్‌కు కేంద్రం శుభవార్త.. కొవిడ్‌ బీమాపై కీలక నిర్ణయం..

Corona Virus: ఇప్పటికే మూడు దఫాలుగా మన దేశంపై విరుచుకుపడింది కరోనా మహమ్మారి. ఇక వైరస్‌ ప్రభావం అంతరించిపోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

Covid Insurance Scheme: హెల్త్ వర్కర్స్‌కు కేంద్రం శుభవార్త.. కొవిడ్‌ బీమాపై కీలక నిర్ణయం..
Coronavirus
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 20, 2022 | 7:54 AM

Corona Virus: ఇప్పటికే మూడు దఫాలుగా మన దేశంపై విరుచుకుపడింది కరోనా మహమ్మారి. ఇక వైరస్‌ ప్రభావం అంతరించిపోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధానిలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా విధుల్లో పాలుపంచుకునే వైద్య, ఆరోగ్య సిబ్బందికి కేంద్ర ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. కేంద్ర ఆరోగ్య బీమా పథకాన్ని (Covid Insurance Scheme) గడువును మరో 6 నెలల పాటు పొడిగించింది. తాజా ఉత్తర్వులతో ఏప్రిల్‌ 19 నుంచి మరో ఆరునెలలు (180 రోజుల) పాటు వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. ఏప్రిల్ 19తో ఈ గడువు పూర్తి కావడంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

రూ.50 లక్షల బీమా..

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో హెల్త్‌వర్కర్స్‌కు బీమా సదుపాయాన్ని కలిగించేందుకు 2020 మార్చి 30 నుంచి ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కరోనా సంబంధిత విధుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.50లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, ప్రైవేట్‌ హెల్త్‌ వర్కర్లతో సహా కొవిడ్‌ బాధితులకు నేరుగా సేవలందించే 22.12లక్షల మందికి ఈ బీమా సౌకర్యాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ అందిస్తోంది. అయితే ఏప్రిల్19తో ఈ స్కీం గడువు పూర్తైంది. అయితే ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం తాజాగా బీమా గడువును మరో ఆరు నెలలు (180 రోజులు) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ బీమా పథకంలో భాగంగా ఇప్పటివరకు 1905 ఆరోగ్య కార్యకర్తలకు బీమా క్లెయిమ్‌ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read: Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..

Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా.? అయితే ఇలా మార్చుకోవచ్చు.. ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే..

Aadhaar Update: ఆధార్ కార్డులో తప్పులున్నాయా.? అయితే ఇలా మార్చుకోవచ్చు.. ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే..