సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.. ఎందుకని ఆయన ఒక్కడే..!!
సుడిగాలి సుధీర్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటనపై ఆసక్తితో హైదరాబాద్ చేరుకుని ఎన్నో కష్టాలు పడ్డాడు. పలు ఈవెంట్లలో మ్యాజిక్ షోలు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ బుల్లితెరపై వచ్చిన జబర్దస్థ్ కామెడీ షో సుధీర్ జీవితాన్ని మలుపు తిప్పింది.

సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ప్రేక్షకులను మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు. జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఆతర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడు. ఆతర్వాత మెల్లగా టీమ్ లీడర్ అయ్యింది తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నాడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సుధీర్ ఆతర్వాత హీరోగా మారాడు. సుదీర్ హీరోగా వేర్ ఈజ్ విద్యా బాలన్ , నేనోరకం, సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్, జ, కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడ్, కాలింగ్ సహస్త్ర వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు గోట్ అనే సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
G.O.A.T చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. చాలా రోజులుగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్య ఓ వివాదంలోనూ ఇరుక్కున్నాడు సుధీర్. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో సుధీర్ కు మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోలకు సామానంగా సుధీర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ
ఇక సుధీర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇన్ స్టా గ్రామ్ లో సుధీర్ ను చాలా మంది ఫాలో అవుతున్నారు. 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సుదీర్ మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు. అది ఎవరినో తెలుసా.. సుధీర్ ఇన్ స్టాలో మెగాస్టార్ చిరంజీవిని ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. సుధీర్ కు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




