విజయ్ దేవరకొండ సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయ పంచెకట్టులో కనిపించారు. పాతకాలం నాటి పంచెకట్టు, గాగుల్స్, మీసాలు తిప్పుతూ ఉన్న తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ ట్రెడిషనల్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పండుగకు అమ్మాయిలు పట్టు వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తుండగా, విజయ్ దేవరకొండ పాత సంప్రదాయాన్ని తిరిగి తీసుకువచ్చారు.