ఇప్పుడు కుర్రవాళ్ల డ్రీమ్ గర్ల్ ఆమెనే.. గ్లామర్‏తో చంపేస్తోన్న ఆషిక

Rajitha Chanti

Pic credit - Instagram

16 January 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు ఆషిక రంగనాథ్. తెలుగులో ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందరినీ ఆకర్షించింది.

ఆ తర్వాత నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. మరోసారి తనదైన నటనతో మెప్పించింది.

ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో గ్లామర్ బ్యూటీగా కనిపించింది.

ఈ సినిమాలో హీరోకు గర్ల్ ఫ్రెండ్ గా ఆషిక కనిపించారు. ఈ మూవీలో స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులను ఆకట్టుంది ఈ వయ్యారి.

ఈ సినిమా మొత్తంలో ఆమె పాత్రకు ఉన్న గ్లామర్ క్యారెక్టర్ ఫ్రెష్ నెస్ తో అలరించింది. దీంతో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది. 

టాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ఆమెనే అని తెలుస్తోంది.  ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టినట్లు టాక్.

అలాగే అటు సోషల్ మీడియాలోనూ అందాల ఫోటోలతో రచ్చ చేస్తుంది.  ఇప్పుడు ఆమె అప్ కమింగ్ సినిమాలపై దృష్టి పడింది.