సోషల్ మీడియాకే పరిమితం అవుతున్న అందాల ముద్దుగుమ్మ

Rajeev 

16 January 2026

 ప్రియాంక జవాల్కర్.. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో హిట్టు అందుకుంది ఈ చిన్నది. 

ప్రియాంక జవాల్కర్.. అచ్చ తెలుగమ్మాయి. కెరీర్ బిగినింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆకట్టుకుంది. 

టాక్సీవాలాతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అందంతోపాటు అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

1992లో నవంబర్ 12న ఏపీలోని అనంతపురంలో మరాఠీ కుటుంబంలో జన్మించింది.

ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది.

ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ అవి హిట్ అవ్వలేదు. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 

ఇప్పుడు సినిమాలు లేకపోవడం సహయ నటిగా నటించేందుకు రెడీ అయ్యింది.  టెల్లు స్క్రైర్ చిత్రంతోపాటు చివరిగా మ్యాడ్ 2లో కనిపించింది.