Healthy Eating: టీతో పాటు చపాతీ తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే!
ఉదయం నిద్రలేవగానే వేడి టీ.. అందులో నంచుకోవడానికి చపాతీ! ఇది వినడానికి చాలా బాగుంటుంది, పొట్ట కూడా నిండుగా అనిపిస్తుంది. అయితే, రుచికి బాగున్న ఈ కాంబినేషన్ మీ శరీరం లోపల మాత్రం పెద్ద యుద్ధమే చేస్తోంది. ఆయుర్వేదం ప్రకారం పాలు, ఉప్పు కలిసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుండి జీర్ణ సమస్యల వరకు ఎన్నో అనర్థాలు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకోండి.

పని ఒత్తిడిలో ఉండి త్వరగా ఏదో ఒకటి తినేయాలి అనుకునే వారికి టీ-చపాతీ ఒక ‘గో-టు’ మీల్. కానీ, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఈ అలవాటును వెంటనే మార్చుకోవాల్సిందే! టీలోని టానిన్లు మీ శరీరానికి అందాల్సిన పోషకాలను ఎలా అడ్డుకుంటాయో, ఇది రక్తహీనతకు ఎలా దారితీస్తుందో డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి..
ఆయుర్వేద విరుద్ధ ఆహారం: చపాతీ పిండిలో ఉప్పు కలుపుతారు, టీని పాలతో తయారు చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం పాలు ఉప్పు విరుద్ధ ఆహారాలు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఐరన్ శోషణకు అడ్డంకి: టీలో ఉండే ‘టానిన్లు’ చపాతీలోని ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి, రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంది.
జీర్ణ సమస్యలు: ఈ కలయిక వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.
పోషకాల లోపం: మీరు ఎంత పోషక విలువలున్న ఆహారం తిన్నా, టీతో కలిపి తీసుకోవడం వల్ల ఆ పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు.
ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, వాటిని తీసుకునే పద్ధతి సరిగ్గా లేకపోతే శరీరానికి పోషకాల లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా టీ చపాతీ వంటి విరుద్ధ ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు, టీలో ఉండే ‘ఫైటేట్స్’ ‘టానిన్లు’ ఆహారంలోని కాల్షియం, మెగ్నీషియం జింక్ వంటి ఖనిజాలతో బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీనివల్ల ఆ పోషకాలు రక్తంలోకి శోషించబడకుండా వ్యర్థాలుగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా, మీరు ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ, కణాల స్థాయికి పోషకాలు అందక శరీరం నీరసించిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం మరియు దీర్ఘకాలికంగా విటమిన్ల లోపానికి గురికావడం జరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
