AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాత, పిత్త దోషాలకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే

వాము (Ajwain)లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది వాస్తవానికి మన వంటింటిలో సర్వసాధారణంగా కనిపించే ఒక మసాలా దినుసు.. వాము, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. దీనిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ

వాత, పిత్త దోషాలకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
Ajwain Water Benefits
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2026 | 9:49 AM

Share

వాము (Ajwain)లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది వాస్తవానికి మన వంటింటిలో సర్వసాధారణంగా కనిపించే ఒక మసాలా దినుసు.. వాము, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. దీనిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. వాము “వాతపిత నాశకారి”. అంటే ఇది శరీరంలోని వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. వాతం అంటే గ్యాస్ సమస్యలు, పిత్తం అంటే ఎసిడిటీ.. ఈ రెండు సమస్యలను వాము సమర్థవంతంగా తగ్గించగలదు. ఈ సమస్యలు ఉన్నవారు వాము నీటిని తీసుకోవడం ఉత్తమం.. ఇది.. జీర్ణక్రియను మెరుగుపరచడం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జలుబు, దగ్గు, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. ఇది మెరుగైన జీవక్రియ, గుండె ఆరోగ్యం, డెటాక్సిఫికేషన్‌కు కూడా దోహదపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వాత దోషం, దాని ప్రభావాలు:

శరీరంలో వాతం (గ్యాస్) అధికమైనప్పుడు, అది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ గ్యాస్ శరీరంలోని బలహీనమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది, నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా, దెబ్బతిన్న లేదా నొప్పి ఉన్న భాగాలలో గ్యాస్ పేరుకుపోయి నొప్పిని తీవ్రతరం చేస్తుంది. వాము గ్యాస్‌ను తగ్గించడం ద్వారా ఈ రకమైన నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

పిత్త దోషం, దాని ప్రభావాలు:

ఎసిడిటీ (పిత్త దోషం) కూడా అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. గొంతులో మంట, కడుపు నొప్పి, అజీర్ణం, నులిపురుగులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి 80% అనారోగ్యాలు ఎసిడిటీతో ముడిపడి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. వాము ఎసిడిటీని తగ్గించడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ నియంత్రించడంలో సహాయపడుతుంది. అసిడిటీ తగ్గినప్పుడు, హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.

వామును ఎలా తీసుకోవాలి?

వామును నీటిలో, పాలలో, కొద్దిగా ఉప్పుతో కలిపి, కూరలలో, మజ్జిగలో – ఇలా అనేక విధాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే, అత్యంత ప్రభావవంతమైన పద్ధతి రాత్రిపూట వాము నీటిని తయారుచేసి ఉదయాన్నే తాగడం.. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వాము వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నిద్రలేవగానే, బ్రష్ చేయకుండానే, ఆ నీటిని తాగి, నానబెట్టిన వాము గింజలను నమిలి మింగాలి.

వాము నీటి అద్భుత ప్రయోజనాలు:

బరువు తగ్గుదల: ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే, అనవసరమైన పొట్ట కొవ్వు (బెల్లీ ఫ్యాట్), బరువు తగ్గుతుంది. వాము ఒక సమర్థవంతమైన కొవ్వు కరిగించే ఏజెంట్‌గా పనిచేస్తుంది.

జీర్ణ సమస్యలు: గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు వాము దివ్యౌషధం. కడుపు నొప్పికి, రాత్రి నానబెట్టిన వాము నీటిని కొద్దిగా వేడి చేసి, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగడం ఉపశమనాన్ని ఇస్తుంది.

మధుమేహ నియంత్రణ: ఉదయాన్నే వాము నీటిని గోరువెచ్చగా తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

శిశువులకు జీర్ణక్రియ: తల్లిపాలు సరిపోనప్పుడు శిశువులకు ఆవు లేదా గేదెపాలు ఇస్తారు. ఈ పాలను జీర్ణం చేసుకోవడానికి వాము చాలా సహాయపడుతుంది. వామును ఒక సన్నని వస్త్రంలో చుట్టి, పాలలో వేసి మరిగించి, ఆ పాలను వడపోసి పసిపిల్లలకు పల్చగా ఇవ్వడం వల్ల గ్యాస్ సమస్యలు లేకుండా పాలు సులభంగా జీర్ణం అవుతాయి.

నులిపురుగులు: వాములోని వగరు, చేదు గుణాలు కడుపులోని నులిపురుగులను, హానికరమైన సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. కడుపు నొప్పి వచ్చినప్పుడు, వేడి అన్నంలో కొద్దిగా నూనె, రెండు స్పూన్ల వాము కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి, కడుపు నొప్పి తగ్గుతుంది.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us