US-Israel Iran War Live: ఇరాన్‌లో ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 1,145 మంది మృతి
US-Israel Iran War News LIVE Updates in Telugu: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు ఐదో రోజు భీకరంగా మారింది. ఒకవైపు టెహ్రాన్ నగరంలో అమెరికా B2 బాంబర్లు మృత్యుఘోష వినిపిస్తుంటే, మరోవైపు ఇరాన్ తన సూపర్ సోనిక్ మిస్సైళ్లతో టెల్ అవీవ్‌ను వణికిస్తోంది. సముద్ర గర్భంలో అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ చేసిన ప్రతీకార దాడితో ఈ యుద్ధం మహా సంగ్రామంగా మారింది.

LIVE NEWS & UPDATES
-
అసెంబ్లీ గడువు ఎప్పుడు ముగుస్తుంది?
- పశ్చిమ బెంగాల్: మే 7, 2026
- తమిళనాడు: మే 10, 2026
- అస్సాం: మే 20, 2026
- కేరళ: మే 23, 2026 . పుదుచ్చేరి: జూన్ 15, 2026
-
ప్రభుత్వానికి ధన్యవాదాలు: పివి సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తిరిగి వచ్చిన తర్వాత, ఆమె మాట్లాడుతూ, తాము దాదాపు 2-3 రోజులు దుబాయ్‌లో చిక్కుకుపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని, ప్రభుత్వానికి, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌కు వారి అపారమైన సహాయానికి నేను చాలా కృతజ్ఞుడను అని అన్నారు.
VIDEO | Hyderabad: Two-time Olympic medal-winning Indian badminton star P V Sindhu, who was stranded in Dubai due to closure of airspace in the Gulf region, recounts her ordeal.
She says, “It was definitely very scary and stressful moment because we were stuck almost for 2-3… pic.twitter.com/pjVQXNJdJH
— Press Trust of India (@PTI_News) March 4, 2026
-
-
ఓడ సిబ్బందిని రక్షించారు: ఒమన్
హార్ముజ్ దీవి సమీపంలో రెండు క్షిపణుల దాడిలో చిక్కుకున్న ఓడలోని సిబ్బందిని రక్షించినట్లు ఒమన్ తెలిపింది.
-
యూఏఈలో మరో పేలుడు
యుఎఇపై ఇరాన్ దాడులు ఆగకుండా కొనసాగుతున్నాయి. మరోసారి దానిని లక్ష్యంగా చేసుకున్నారు. మరో పేలుడు సంభవించింది.
-
ఇరాన్ రాయబారికి టర్కీ సమన్లు
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య టర్కీ గణనీయమైన చర్య తీసుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టర్కీ అంకారాలోని ఇరాన్ రాయబారిని పిలిపించింది. బాలిస్టిక్ క్షిపణి దాడిపై నిరసన మరియు ఆందోళన వ్యక్తం చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగిందని దౌత్య వర్గాలు తెలిపాయి.
-
-
ఇరాన్ మనపై ఎక్కువ కాలం నిలబడలేదు: పీట్ హెగ్సేత్
అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఒక ముఖ్యమైన వాదన చేశారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, హెగ్సేత్ మాట్లాడుతూ, “ఇరాన్ మనపై ఎక్కువ కాలం నిలబడలేదు. యుద్ధ వేగాన్ని మనమే నిర్ణయిస్తాం. శత్రువు సమతుల్యతలో లేడు. వారి కాల్పుల సామర్థ్యానికి, మన రక్షణ సామర్థ్యానికి మధ్య వ్యత్యాసం మాకు తెలుసు. ఈ అంతరం ప్రతిరోజూ పెరుగుతోంది” అని అన్నారు.
-
వీసాల గడువు పొడిగింపు
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవాసులు, సందర్శకులకు ఉపశమనం కలిగించే కీలకమైన ప్రకటన చేసింది. విజిట్ వీసాపై దేశానికి వచ్చిన వారికి, ప్రస్తుతం విదేశాలలో నివాస అనుమతులు ఉన్నవారికి మంత్రిత్వ శాఖ మినహాయింపులు మంజూరు చేసింది. ప్రస్తుతం కువైట్‌లో ఉన్న ప్రవాసుల విజిట్ వీసా చెల్లుబాటును మరో నెల రోజులు పొడిగించారు. ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వీసాల గడువు ముగియబోతున్న వారు దేశంలో కొనసాగడానికి ఇది సహాయపడుతుంది.
-
-
ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం రద్దు
ఖమేనీ అంత్యక్రియలు రద్దు అయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం, ఖమేనీ అంత్యక్రియలు ఈ రాత్రి రాత్రి 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆ కార్యక్రమాన్ని అకస్మాత్తుగా మార్చారు.
-
టర్కీపై ఇరాన్ క్షిపణి దాడి
టర్కీపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. టర్కీ గగనతలంలోకి ప్రవేశించిన బాలిస్టిక్ క్షిపణి తూర్పు మధ్యధరాలోని నాటో వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఢీకొట్టిందని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
-
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య, శ్రీలంక తీరంలో ఒక ఇరానియన్ నౌకను ఒక జలాంతర్గామి లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటివరకు ఈ దాడిలో 101 మంది గల్లంతైనట్లు సమాచారం. 78 మంది గాయపడ్డారు. వారిలో 32 మంది పరిస్థితి విషమంగా ఉంది.
At least 101 people were missing and 78 wounded after a submarine attack on an Iranian ship off Sri Lanka’s coast, sources in Sri Lanka’s navy and defence ministry told Reuters on Wednesday: Reuters
— ANI (@ANI) March 4, 2026
-
ఇరాన్‌లో ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 1,145 మంది మృతి
ఇజ్రాయెల్-అమెరికన్ దాడిలో ఇరాన్‌లో ఇప్పటివరకు 1145 మంది మరణించారు.
-
జోర్డాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మూసివేత
మధ్యప్రాచ్యంలో అమెరికా గణనీయమైన సవాలును ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్, అమెరికా టెహ్రాన్‌లో ఉద్రిక్తత సృష్టించగా, ఇరాన్ ఎదురుదాడి అమెరికాకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. జోర్డాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలికంగా మూసివేసింది. పాకిస్తాన్‌లోని అమెరికా కాన్సులేట్‌లోని సిబ్బందిని కరాచీ, లాహోర్‌లను వదిలి వెళ్లమని కోరారు. ఇంకా, అవసరమైన సిబ్బందిని మాత్రమే సౌదీ అరేబియాలోనే ఉండాలని ఆదేశించారు.
-
ఇరాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన F-35I “అదిర్” యుద్ధ విమానం ఇరానియన్ వైమానిక దళానికి చెందిన YAK-130 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. F-35 మానవ సహిత యుద్ధ విమానాన్ని కూల్చివేసిన సంఘటన చరిత్రలో ఇదే తొలిసారి అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
-
యుద్ధం తీవ్రతరం
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదోరోజైన బుధవారంనాడు మరింత తీవ్రమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది.
-
ట్రంప్-నెతన్యాహు పోస్టర్లను తగలబెట్టిన మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకించారు. ఈరోజు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పోస్టర్లను తగలబెట్టిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, మెహబూబా ఇలా రాశారు, “మీతో నిలబడే వారితో నేను శాంతియుతంగా నిలబడతాను.. తీర్పు రోజు వరకు మిమ్మల్ని వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా నిలబడతాను.” అంటూ ట్వీట్ చేశారు.
-
కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్
అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇంకా ఖననం చేయలేదు. అతని కుమారుడు ముజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలీ ఖమేనీ శుక్రవారం ఖననం చేయనున్నారు. అయితే ఎవరైతే సుప్రీం లీడర్ అవుతారో వారిని చంపుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే ముజ్తబాను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
-
ట్రంప్ పై ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
అణు చర్చల వంటి సున్నితమైన చర్చలను ఆస్తి లావాదేవీల వలె పరిగణించినప్పుడు, కఠోరమైన అబద్ధాలు వాస్తవికతను అస్పష్టం చేసినప్పుడు, అవాస్తవ అంచనాలను ఎప్పటికీ అందుకోలేమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఎక్స్-పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన ట్రంప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ దౌత్యాన్ని, తనను ఎన్నుకున్న అమెరికన్లను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
-
230 డ్రోన్లను ప్రయోగించాం – ఇరాన్
- ఇజ్రాయెల్-అమెరికాపై 17వ విడత దాడి
- 230 డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ సైన్యం ప్రకటన
- ఇరాక్, కువైట్‌లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేశామన్న ఐఆర్‌జీసీ
-
ఇరాన్‌లో1000 మందికి పైగా మృతి..
- యుద్ధం వల్ల ఇరాన్‌లో1000 మందికి పైగా మృతి..
- అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడి
- ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం
-
బీరుట్‌లో భారీ పేలుళ్లు
- పశ్చిమాసియాలో తీవ్రరూపం దాల్చుతోన్నయుద్ధం
- మిసైల్ దాడులతో దూకుడు పెంచుతున్న ఇజ్రాయెల్
- లెబనాన్ రాజధాని బీరుట్‌లో భారీ పేలుళ్లు
- బీరుట్‌లో భారీగా వెలువడుతోన్న పొగలు
- హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామన్న ఇజ్రాయెల్
-
కొత్త సుప్రీం లీడర్‌ను చంపేస్తాం – ఇజ్రాయెల్
- కొత్త సుప్రీం లీడర్‌ను చంపేస్తాం – ఇజ్రాయెల్
- తేల్చిచెప్పిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్
- ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకొనేవారిని వదిలిపెట్టమని వ్యాఖ్య
- ఎవరైనా.. ఎక్కడ దాక్కున్నా చంపేస్తామని హెచ్చరిక
-
యూఏఈకి అండగా ఫ్రాన్స్
- యూఏఈకి అండగా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ల మోహరింపు
- ప్రకటించిన ఫ్రాన్స్ రక్షణ మంత్రి జేన్ నోయల్ బారోట్
- అమెరికా-ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ చట్టాలకు అతీతంగా జరిగాయన్న ఫ్రాన్స్
- ఇప్పటికే యుద్ధ నౌకలను తరలించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆదేశాలు
-
ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు
- ఇరాన్ దివంగత నేత ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు
- శుక్రవారం అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
- ఖమేనీ సొంతూరు మషాద్‌లో ఖననం చేసేందుకు సన్నాహాలు
- టెహ్రాన్‌లో ఇవాళ్టి నుంచి 3 రోజుల అంతిమ దర్శనాలు
- ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి
- ఇప్పటికే ఇరాన్‌లో సంతాపదినాలు, సెలవులు
-
ఇరాన్ దగ్గర అణు బాంబు లేదు..
- ఇరాన్ చేపట్టిన అణుప్రాజెక్టుపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధినేత రాఫెల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్ దగ్గర అణు బాంబు లేదు.. కానీ యురేనియం నిల్వలు ఆందోళనకరం: IAEA
- ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందంటూ అమెరికా ఆరోపణలు
-
ఇరాన్ మీద మిసైళ్ల వర్షం
- ఇరాన్ మీద మిసైళ్ల వర్షం కురిపిస్తోన్నఅమెరికా-ఇజ్రాయెల్
- ఇరాన్‌లోని 2000 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటన
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమెరికా భీకర దాడులు
- B2 బాంబర్లతో టెహ్రాన్‌లో అమెరికా దాడులు
- క్షిపణి స్థావరాలు, IRGC సెంటర్ లక్ష్యంగా దాడులు
- ఇరాన్ ఆయుధ డిపోలపైనా B2 బాంబర్లతో US దాడులు
-
కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ
- ఇరాన్ కొత్త సుప్రీంలీడర్‌గా మొజ్తబా ఖమేనీ
- ఇరాన్ అసెంబ్లీ ఎన్నుకున్నట్లు ఇజ్రాయెలీ మీడియా కథనాలు
- ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబాకే ఇరాన్ సారధ్య బాధ్యతలు
- ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో అయతుల్లా ఖమేనీ మృతి
- ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా తెరపైకి మొజ్తబా పేరు
- మొజ్తబా ఖమేనీని అధికారికంగా ఎన్నుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు
-
అణుప్రాజెక్టును ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
- ఇరాన్ రహస్య అణుప్రాజెక్టును ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
- మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటు చేసి న్యూక్లియర్ కాంపౌండ్‌పై దాడి
- గతేడాది అమెరికా దాడుల తర్వాత అణు కార్యక్రమం అక్కడికి మళ్లించిన ఇరాన్
-
ట్రంప్‌కు పెంటగాన్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్
- ట్రంప్‌కు పెంటగాన్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్
- ఇరాన్ వార్ పదిరోజులు దాటితే మిసైళ్ల కొరత
- ఇరాన్‌పై ఇలానే దాడిచేసుకుంటూ వెళితే..
- పది రోజులకు మించి మిసైళ్లు లేవన్న పెంటగాన్
- యుద్ధానికి భారీ ఖర్చే అవుతోందంటూ పెంటగాన్ ఆందోళన
- తమ దగ్గర భారీగా మిసైళ్లున్నాయంటూ ట్రంప్ ట్వీట్
- పైకి గంభీరంగా ఉన్నా.. అమెరికాకు భారీగా జరుగుతున్న నష్టం
- నాలుగైదు వారాలపాటు యుద్ధం ఉంటుందంటూ ట్రంప్ కామెంట్స్
- నాలుగైదు వారాలు దాటితే అమెరికా యుద్ధం చేస్తుందా అనే అనుమానం
- ఇంటర్‌సెప్టార్ మిసైళ్ల కొరత కూడా వస్తుందంటూ పెంటగాన్ ఆందోళన
-
ప్రతాపం చూపిస్తున్న ఇరాన్
- పశ్చిమాసియా దేశాల్లో ప్రతాపం చూపుతున్న ఇరాన్
- అమెరికా సైన్యానికి మరో ఎదురుదెబ్బ
- యూఏఈలో అమెరికా థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం
- యూఏఈకి చెందిన రెండు రాడార్లను కూల్చేసినట్లు ఇరాన్ ఆర్మీ
- థాడ్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలినట్లు చెబుతున్న ఉపగ్రహ చిత్రాలు
- పశ్చిమాసియాలో 2 థాడ్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కోల్పోయిన అమెరికా
-
డ్రోన్‌తో ఇరాన్ దాడి
- దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్‌తో దాడి
- US కాన్సులేట్ భవనానికి ఆనుకుని ఉన్న పార్కింగ్ స్థలాన్ని తాకిన డ్రోన్
- దీంతో దాడి జరిగిన ప్రాంతంలో అగ్నిజ్వాలలు చెలరేగాయి
- డ్రోన్ దాడి తర్వాత సిబ్బంది సురక్షితంగా ఉన్నారన్న అమెరికా విదేశాంగ శాఖ
-
ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తాం
- ఇరాన్ దాడులకు తగిన బుద్ధి చెబుతాం అన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- దాడులు చేసి ఇరాన్ పక్క దేశాలను బెదిరిస్తోంది
- అణ్వాయుధాలు కలిగి ఉండాలన్న ఇరాన్ కోరికను అంగీకరించకూడదు
- ఇరాన్ తమ దేశ పౌరుల ప్రాణాలనే పణంగా పెడుతోంది
- ఇతర దేశాలకు ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో గ్రహించాలి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ ఐదో రోజు ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ కూటమి భీకర దాడులకు దిగగా, ఇరాన్ సైతం అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికా తన అత్యంత శక్తివంతమైన B2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా వాయుసేన భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఆయుధ డిపోలు, క్షిపణి స్థావరాలే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని దాదాపు 2000 వ్యూహాత్మక ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ కాన్సులేట్ కూడా దెబ్బతినడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ ప్రతీకారం
అమెరికా గగనతల దాడులకు ప్రతిగా ఇరాన్ సముద్ర మార్గంలో గట్టి దెబ్బ కొట్టింది. ఇరాన్ తీరానికి 600 కి.మీ దూరంలో ఉన్న అమెరికా నేవీకి చెందిన US డిస్ట్రాయర్ యుద్ధ నౌకపై ఇరాన్ దాడి చేసింది. అత్యాధునిక ఖదర్-380 మిస్సైల్‌తో ఈ దాడి చేసినట్లు IRGC ధృవీకరించింది. అమెరికన్ ట్యాంకర్ యుద్ధ నౌకకు రీఫ్యూయలింగ్ చేస్తున్న సమయంలో ఈ దాడి జరగడంతో రెండు నౌకల్లోనూ భారీగా మంటలు వ్యాపించాయి. ఇది అమెరికా నావికాదళానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
టెల్ అవీవ్‌పై సూపర్ సోనిక్ దాడి
ఇజ్రాయెల్ గుండెకాయ వంటి టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ ఊహించని దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన సూపర్ సోనిక్ మిస్సైల్ ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేదించుకుంటూ టెల్ అవీవ్‌లో కుప్పకూలింది. దీంతో నగరంలో భారీ విస్ఫోటనం సంభవించింది. దాడులు జరిగిన ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకుంది.
Published On - Mar 04,2026 10:34 AM




