మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌లో కులాంతర ప్రేమను వ్యతిరేకించిన తల్లి కన్నకూతురిని దారుణంగా హత్య చేసింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందన్న కారణంతో కుమార్తెతో ఆశా గురుడు తరచు గొడవలు పడేది. ఆదివారం రాత్రి వాగ్వాదం తీవ్రమై స్కార్ఫ్‌తో గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.